– 40 రోజులపాటు నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు
వాషింగ్టన్, నవంబర్ 10: అమెరికాలో నెలకొన్న ప్రభుత్వ షట్‌డౌన్ మేఘాలు వీడిపోనున్నాయి. దీనికి అనుకూలంగా ఆ దేశ సెనెట్ ఓటింగ్ జరిగింది. కొందరు డెమోక్రాట్లు కూడా అనుకూలంగా ఓటు వేయడంతో 40 రోజులపాటు నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అమెరికా ప్రభుత్వానికి నిధుల విడుదలకు సంబంధించిన బిల్లులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్‌కు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మొదలైన షట్‌డౌన్ ఆదివారం నాటికి 40వ రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం కలగడంతో ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి సెనెటర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షట్‌డౌన్ ముగించే దిశగా తొలి అడుగు పడింది. ట్రంప్, రిపబ్లికన్లు ప్రతిపాదించిన ఓ డీల్‌కు కొందరు డెమోక్రాట్లు సానుకూలంగా స్పందించారు. చివరి నిమిషంలో టెక్సాస్ సెనెటర్ జాన్ కార్నిన్ ఓటుతో తీర్మానానికి అనుకూలంగా 60 ఓట్లు వచ్చాయి. సెనెట్‌లో రిపబ్లికన్ సభ్యుల సంఖ్య 53 కాగా డెమోక్రాట్ల సంఖ్య 45. ఇద్దరు స్వతంత్రులు కూడా ఉన్నారు. బిల్లు ఆమోదం పొందాలంటే 60 ఓట్లు రావాలి. ఇప్పుడు కనీసం ఎనిమిది మంది డెమోక్రాట్లు మద్దతు ఇచ్చారు. అమెరికాలో షట్‌డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. 1981 నుంచి అక్కడి ప్రభుత్వం 15 సార్లు మూతపడిరది. 2018`19 మధ్య దాదాపు 35 రోజులపాటు మూతపడగా అప్పటికి అదే సుదీర్ఘ షట్‌డౌన్. ట్రంప్ హయాంలో ప్రభుత్వ సేవలు నిలిచిపోవడం ఇది మూడోసారి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





