దార్శనికుడు అంబేడ్కర్

– స్మరించుకున్న సీఎం రేవంత్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రేపు (14న) అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు, మహిళల సాధికారతకు ఆయన నిరంతరాయంగా కృషి చేశారని గుర్తు చేశారు. దేశ భవిష్యత్తుకు దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. అణగారిన వర్గాల ప్రజల హక్కులకు ఆయన చేసిన పోరాటం యావత్ ప్రపంచానికి ఆదర్శమని చెప్పారు. ఆ మహనీయుని ఆశయాల సాకారానికి మనమంతా కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ ఆలోచనల నుంచి ప్రేరణ పొందిన ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. ఎస్సీ. ఎస్టీ సబ్ ప్లాన్ అమలుతోపాటు రాష్ట్రంలో దళిత, గిరిజన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మెస్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలు ప్రజా ప్రభుత్వం పెంచిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. దీంతో అన్ని వర్గాలు, అన్ని మతాల పిల్లలు ఒకేచోట నాణ్యమైన విద్యా బోధనను అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మంత్రి సీతక్క ఘన నివాళులు

అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంత్రి దనసరి అనసూయ సీతక్క ఘనంగా నివాళులర్పించారు. అంబేడ్కర్ సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పాత్ర దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను పాటిస్తూ సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేడŠ్కర్ ఆశయాలను సాకారం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అంబేడ్కర్ సేవలను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *