మహానుభావుడు అంబేద్కర్‌

– వారి ఆలోచనలే రాష్ట్ర పాలనకు మార్గదర్శకాలు
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్‌్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: ఒక సామాన్యునికి బలమైన ఓటు హక్కు అనే ఆయుధం ఇచ్చి వారి భవిష్యత్తును వారే రాసుకునే విధంగా రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి భారత దేశంలో పుట్టడం మనందరి అదృష్టంగా భావిస్తున్నానన్నారు. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా లోయర్‌ ట్యాంక్‌ బండ్‌పై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వ పాలనకు మార్గదర్శకాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా రాష్ట్రానికే కాదు దేశానికే ఆయన ఆలోచనలు మార్గదర్శకం అన్నారు. వారి ఆలోచనల మేరకు నడవడమే ఈ దేశానికి గొప్ప భవిష్యత్తు అని భట్టి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి అత్యంత బలమైన, అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు అంబేద్కర్‌ అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని రేపటి భవిష్యత్తు కోసం, అసమానతలు లేని సమాజం కోసం దేశ ఆర్థిక, సామాజిక, భౌతిక వనరులన్నిటినీ సక్రమంగా, సమానంగా ప్రజలందరికీ పంచడమే వారికి అర్పించే ఘనమైన నివాళి అని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *