కాలు తొల‌గించ‌కుండానే అద్భుత‌మైన శస్త్రచికిత్స

– కేర్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ల విజ‌యం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 17: కాలు తొలగించాల్సిందేనని పలువురు వైద్యులు చెప్పిన ఒక కేసు చివరకు కాలు తొల‌గించ‌కుండానే విజ‌య‌వంతంగా చికిత్స నిర్వ‌హించిన క‌థ‌నం ఇది. తిరుపతికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి అతని కాలును రక్షించారు. ఈ రోగి గత కొన్ని రోజులుగా కుడి కాలులో తీవ్రమైన నొప్పి, పెద్దవేలు నల్లబడటం వంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చాడు. రెండు నెలల క్రితం కూడా ఇలాంటి సమస్య రావడంతో, అప్పట్లో కాలులో రక్తప్రసరణ ఆగిపోయిందని గుర్తించి తిరుపతిలో శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స తర్వాత కూడా మందులు వాడుతున్నా, పరిస్థితి మెరుగుపడలేదు. క్రమంగా పెద్దవేలు పాడైపోయే (గ్యాంగ్రీన్) పరిస్థితి ఏర్పడింది. తరువాత చేసిన స్కాన్‌లలో, కాలుకు వెళ్లే రక్తనాళంలో మళ్లీ గడ్డలు ఏర్పడి రక్తం వెళ్లడం పూర్తిగా ఆగిపోయిందని తేలింది. ఈ కారణంగా పలువురు ఆసుపత్రుల్లో కాలు తొలగించాల్సిందేనని చెప్పారు. అయితే, చివరిసారిగా ఆశతో రోగి కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్ ని సంప్రదించాడు. వైద్యులు పూర్తిగా పరీక్షించి మళ్లీ శస్త్రచికిత్స చేసి రక్తప్రసరణ తిరిగి ప్రారంభించవచ్చని నిర్ణయించారు. శస్త్రచికిత్స సమయంలో ప్రత్యేక యంత్రాల సహాయంతో కాలుకు మళ్లీ రక్తం బాగా వెళ్లుతున్నట్టు నిర్ధారించారు. రోగి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోలుకుని ఆరవ రోజున ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యాడు. నెల తరువాత జరిగిన ఫాలోఅప్‌లో పెద్ద వేలు వద్ద ఉన్న గాయం పూర్తిగా మానిపోయింది. ప్రస్తుతం రోగి నొప్పి లేకుండా నడవగలుగుతున్నాడు. ఈ విధంగా కాలు తొలగింపును నివారించగలిగారు. రోగి ఆనందంతో మాట్లాడుతూ  అన్నిచోట్ల కాలు తీసేయాలన్నారు. ఇక నడవలేనేమోనని భయపడ్డాను. కానీ ఇప్పుడు నడవగలుగుతున్నాను. నా కాలు కాపాడిన కేర్ హాస్పిటల్స్ వైద్యులకు నా జీవితాంతం కృతజ్ఞుడిని అన్నారు.

సమయానికి సరైన చికిత్సతో కాలు కాపాడగలిగాం

మలక్‌పేట్ కేర్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియోథొరాసిక్వా, స్కులర్ సర్జన్ డాక్టర్ సుధీర్ గండ్రకోట మాట్లాడుతూ కాలులో రక్తప్రసరణ ఆగిపోవడాన్ని పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ (పీవీడీ) అంటారు. ఇది ముఖ్యంగా పొగతాగే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. పొగతాగడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక చురుకుదనం లేకపోవడం వంటి జీవనశైలి అలవాట్లు ఈ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే షుగర్, హైబీపీ, కొలెస్ట్రాల్ ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. సకాలంలో చికిత్స అందకపోతే కాలు తొలగించే పరిస్థితి వస్తుంది. ఈ రోగికి సమయానికి సరైన చికిత్స అందించడంతో కాలు కాపాడగలిగాం” అన్నారు. కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎడ్ల మాట్లాడుతూ,“రోగి నడవగలగడం అంటే అతని జీవితం మళ్లీ సాధారణ స్థితికి రావడమే. ఇలాంటి ఫలితాలే కేర్ హాస్పిటల్స్‌లో మా వైద్య సేవల లక్ష్యం” అని తెలిపారు. వైద్యుల సూచన ప్రకారం, వృద్ధులు, షుగర్ ఉన్నవారు, కాలులో నొప్పి, రంగు మారడం, గాయాలు మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సకాలంలో చికిత్స తీసుకుంటే, కాలు తొలగించే ప్రమాదాన్ని నివారించవచ్చ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *