రాష్ట్రానికి తగిన యూరియా కేటాయించండి

కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: రాష్ట్రానికి సరిపడేంత యూరియాను కేటాయించాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. యూరియా కొరతను అధిగమించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి జగత్‌ ప్రకాశ్‌నడ్డాకు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి లేఖలు రాశారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనందున రాష్ట్రంలో యూరియా అవసరం అంతకంతకు పెరిగిందని తెలిపారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించి రాష్టాన్రికి 5 లక్షల మెట్రిక్‌ టన్నుల కోటాను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందని, అందులో ఇప్పటివరకు 3.06 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయిందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 1.94 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కొరత ఏర్పడిరదన్నారు. తాజాగా జులై నెలకు నిర్దేశించిన సప్లై ప్లాన్‌ ప్రకారం రాష్టాన్రికి 1.60 లక్షల మెట్రిక్‌ టన్నులు రావాల్సి ఉందన్నారు. కానీ అందులో 60 శాతం ఇంపోర్టెడ్‌ యూరియాను కేటాయించటం ఆందోళన కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. దిగుమతుల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన యూరియా సకాలంలో చేరుకునే పరిస్థితి లేదని, ఇప్పటివరకు ఆ యూరియాను రవాణా చేసేందుకు అవసరమైన నౌకల కేటాయింపు జరగలేదని లెటర్‌లో ప్రస్తావించారు. దీంతో ఖరీఫ్‌ పంటలకు అనువైన సమయంలో యూరియా కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. యూరియా సరఫరాపై కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జులై నెలకు కేటాయించిన 0.97 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇంపోర్టెడ్‌ యూరియాకు నౌకలను కేటాయించాలని కోరారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి తెలంగాణకు స్వదేశీ యూరియా సరఫరాను 30,800 టన్నుల నుంచి 60,000 టన్నులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు తలెత్తిన యూరియా లోటును భర్తీ చేయడానికి అదనపు కోటాను కేటాయించాలని మంత్రి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *