ద‌ళితుల‌కు కేటాయింపులు కాగితాలకే పరిమితమా?

– చేవెళ్ల డిక్ల‌రేష‌న్ అమ‌లు చేయ‌లేదు
– ఎస్సీల‌కు ఒక్క ప‌థ‌కం అమ‌లు కాలేదు, 18% రిజ‌ర్వేష‌న్ మాటేంటి?
– ఈ ఏడాది ఎస్సీల‌కు ఒక్క‌రూపాయి ఖ‌ర్చు పెట్ట‌లేదు
– ఎస్టీల అభివృద్ధి నిలిచిపోయింది
– హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌కు రూ.32కోట్ల బ‌కాయిలు
– కులాంత‌ర వివాహాల జంట‌ల‌కు ర‌క్ష‌ణ‌లేదు

                                                                                                     (హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌)

నేడు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తున్న బడ్జెట్ ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న‌ది. గత రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఎస్సీ ఎస్టీలకు ఏ ఒక్క కొత్త పథకాన్ని కూడా అమలు చేసిన పాపానికి పోలేదు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేవెళ్ల డిక్లరేషన్ ప్రకటించి ఓట్లు కొల్లగొట్టింది. కానీ ఎస్సీలకు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయ హస్తం ప్రారంభించి 12లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్న హామీ నేటికి కార్యరూపం దాల్చలేదు. పెరుగుతున్న ఎస్సీల జనాభా ప్రకారం 18 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించింది . కానీ నేటికీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎస్సీ ల సంక్షేమానికి బడ్జెట్ లో పెద్దపీట వేస్తున్నామని 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.40,231.62  కోట్లను కేటాయించి కేవలం రూ.19894.91 కోట్లు విడుదల చేసి రూ.14732.94 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 9 శాఖలు ఒక్క రూపాయి కూడా దళితుల సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు చేయలేదు. పైగా 3213.59 వేల కోట్లను దారి మళ్ళించారు. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధుల కేటాయింపు చట్టం కింద 2026-27లో ఎస్సీల జనాభా 18 శాతం ప్రకారం నిధులు కేటాయించాలి. 2025-26లో ఖర్చు చేయకుండా మిగిలిపోయిన రూ.26వేల కోట్లను చట్ట ప్రకారం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఎస్టీలకు రూ.17,169 కోట్లు కేటాయించినప్పటికీ రూ.3000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు..ఈ రెండున్నర సంవత్సరకాలంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్సీ ఎస్టీల సంక్షేమం అభివృద్ధి రక్షణ కోసం ప్రత్యేకంగా చర్చించిన సందర్భం లేదు. కేటాయించిన బడ్జెట్ ఎస్సీ ఎస్టీల సంక్షేమం అభివృద్ధి రక్షణ ల కోసం ఖర్చు చేయకపోవడంతో ఎస్సీ ఎస్టీల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడగానే ఉంది. పైగా కాంగ్రెస్ సంక్షేమ విధానం మారిందని ఇక సంక్షేమం ఉండదని, భూములు పంచమని ,చదువు మాత్రమే చెప్తామని ముఖ్యమంత్రి ప్రకటించి చేతులెత్తేశారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ఒక్క మాట అయినా చెప్పలేదు. సమ్మిళిత అభివృద్ధి, తెలంగాణ రైజీoగ్ అంటూ ప్రచా  రం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సంక్షేమాన్ని, అభివృద్ధిని దాటవేస్తున్న‌ది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎస్సీ ఎస్టీల కు పథకాలు అమలు చేయకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమైనది. విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పదేపదే ముఖ్యమంత్రి చెప్తున్నప్పటికీ ఆచరణలో కనిపించడం లేదు. హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచి ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. విద్యలో, ఆహారంలో నాణ్యతను పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు రూ.32 కోట్ల బకాయిలు చెల్లించాలి. ఈ సంవత్సరం ఇప్పటివరకు నోటిఫికేషన్ జారీ చేయలే దు. బెస్ట్అవలేబుల్ పథకం పథకానికి రూ.649 కోట్లు ఫీజు బకాయిలు, అంబేద్కర్ విద్యానిధి పథకానికి రూ.1894 కోట్ల నిధులను చెల్లించాల్సింది. వివిధ విద్యా పథకాలతో పాటు పథకాలతో పాటు విద్యార్థులకు చెల్లించాల్సిన పోస్ట్, ప్రిమెట్రిక్ స్కాలర్షిప్లను, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడం లో అడుగడుగునా నిర్లక్ష్యంతో విద్యార్థుల పై చదువులకు ప్రభుత్వ విధానాలు ఆటంకంగా మారాయి.మెజారిటీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల కళాశాలల యూనివర్సిటీల బలోపేతానికి బడ్జెట్ లో విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలి. ప్రభుత్వ విద్య బలోపేతానికి రాష్ట్ర విద్యా కమిషన్ చేసిన సానుకూలమైన సిఫార్సులను వెంటనే అమలు చేయాలి. పోలీస్ స్టేషన్ లలో లాకప్ హింసలు, లాకప్ హత్యలు పెరుగుతున్నా యి.బాధితులకు తక్షణ సహాయం నష్టపరిహారం, పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతున్న‌ది. రూ.153.77 కోట్లు ఎస్సీ ఎస్టీ అత్యాచార బాధితులకు పెండింగ్ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఎస్సీ ఎస్టీల పై జరుగుతున్న దాడులను అరికట్టాలని నిరంతరం జాతీయ, రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ కమిషన్లు, దళిత గిరిజన సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ నిధుల విడుదలలో నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో దాదాపు260కి పైగా కుల దురంహంకార హత్యలు జరిగాయి. కులాంతర జంటలకు చెల్లించాల్సిన ఆర్థిక సహాయం అందించడంలో సైతం ప్రభుత్వం నిర్లక్ష్యం ,వివక్షతను ప్రదర్శిస్తున్న‌ది.  కులాంతర జంటలకు రూ.445 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కుల దురంహ కార హత్యలు చేసిన నిందితులలో ఎంతమందికి చట్ట ప్రకారం శిక్షలు పడ్డాయో ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించాలి. ఎస్సీ ఎస్టి కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమించినప్పటికీ యాక్షన్ ప్లాన్ లు ప్రకటించడంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తున్న‌ది.  రాజీవ్ యువ కిరణాలు అంటూ ప్రచారం చేసి దరఖాస్తులు స్వీకరించి నేటికీ సంవత్సరం దాటుతున్న పథకం అమలు చేయకుండా తమ నేత రాజీవ్ గాంధీని అవమానించారు. యాక్షన్ ప్లాన్ సవరించాలి. ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి ఆర్థిక పథకాల కింద గత రెండు రోజుల క్రితం వాహనాల సబ్సిడీ పథకాలను ప్రకటించింది. ఈ యాక్షన్ ప్లాన్ ను సవరించి స్వయం ఉపాధి ఆర్థిక మద్దతు పథకాలైన గతంలో అమలు చేసిన జనరల్ స్టోర్ బ్యాంగిల్స్ స్టోర్, టెంట్ హౌస్ హౌస్ , కారు తదితర పథకాలకు విస్త‌రించాలి. పరిశ్రమల శాఖలో సబ్సిడీల నిధులను విడుదల చేయకుండా సంవత్సరాల తరబడి పెండింగ్ లో పెడుతున్నారు.  అందించడంలో నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తుంది . గిరిజనులపై అటవీ శాఖ పోలీసుల జలుం కొనసాగుతున్న‌ది . అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తానని హామీ నేటికి నెరవేరలేదు. కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తామని మాట తప్పారు. సన్న వడ్లకు బోనస్ కౌలు రైతులకు అందించడం లేదు . భూమిలేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అటకెక్కింది. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్త నడక నడుస్తోంది. ఖమ్మంలో భూధాన్ భూముల్లో పక్కా ఇండ్లు నిర్మించుకున్న పేదల ఇండ్లను కూల్చి వందలాది మందిని నిరాశ్రయులుగా మార్చారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను పంపిణీ చేయడంలో అలసత్వం కొనసాగుతుంది. అర్హులైన అందరికీ పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ నేటికి నెరవేర్చలేదు కొత్త పెన్షన్ల మంజూరు జాడలేదు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ పేరుతో సాగుతున్న ప్రజాపాలనలో ఎస్సీ ఎస్టీల సంక్షేమ అభివృద్ధి రక్షణ కోసం రాజ్యాంగ హక్కుల ప్రకారం ప్రభుత్వంపై ఒత్తిడి చేసి రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తున్నా యి బడ్జెట్ కాగితాల కుపరిమితం చేయకుండా వివిధ పథకాలను అమలు చేసి ఎస్సీ ఎస్టీలు సమాజంలో మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశించినట్లు గౌరవంగా, సామాజికభద్రతతో జీవించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మార్చి 18న ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధ‌ర్నా నిర్వ‌హించ‌నున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *