– ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి
– అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హా ప్రకారం బీసీల సంక్షేమానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని మాజీమంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండు బడ్జెట్‌లు అయిపోయాయని అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ. 10 వేల కోట్ల వరకు ఉన్నాయని, వెంటనే వాటిని ప్రభుత్వం చెల్లించాలని కోరారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కారణంగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు జ్యోతిరావు పూలే ఓవర్సీస్ కార్యక్రమాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని, ఆ పథకం క్రింద అర్హులైన విద్యార్థులకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలను చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీలో బిల్లు పెడితే చట్టబద్దత రాదని, కేంద్ర ప్రభుత్వం 9 వ షెడ్యూల్ లో చేరిస్తేనే చట్టబద్దత వస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తే పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరుకాకపోవడం బీసీల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. బీసీ సమస్యల పై కాంగ్రెస్ పార్టీలోని బీసీ వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.