భూదాన్ భూముల్లో ఇళ్లన్నీ నేలమట్టం

– రెండో రోజూ కొనసాగింపు

ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల రెవెన్యూ పరిధి లోని 147,148,149 సర్వే నెంబర్లలో దాదాపు 21 ఎకరాల 7 కుంటల భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపు బుధవారం కూడా జరిగింది. రెవెన్యూ, పోలీసులు, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో మంగళవారం కూల్చ‌గా మిగిలిన ఇళ్లన్నింటినీ బుధవారం నేలమట్టం చేశారు. బాధితుల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ప్రస్తు తం నిరాశ్రయులైన వారికి కమ్మవారి కళ్యాణ మండపంలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. భూదాన్ భూముల ఆక్రమణదారుల సామగ్రిని  స్థానిక అంబేద్కర్ భవనంలో భద్రం చేశారు. బాధిత ప్రజలు ఆ సామగ్రిని ఎక్కడికి తరలించమంటే అక్కడికి తరలిస్తామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో బాధితులు ఖమ్మం -వైరా రహదారిపై నిరసన చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మహిళలను కూడా ఈడ్చుకెళ్లారని బాధితులు ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్ట‌కేల‌కు పరిస్థితిని అదుపులోకి తీసుకు వ‌చ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *