రైతులను పట్టించుకోని సీఎం రేవంత్‌

– బీజేెఎల్‌పి నేత ఏలేటి విమర్శలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: సీఎం రేవంత్‌ రెడ్డి గాలి మోటర్‌లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పెద్దఎత్తున పంట నష్టం జరిగిందని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విూడియాతో మాట్లాడారు. రైతులను కాపాడాలన్న కనీస ఇంగిత జ్ఞానం ముఖ్యమంత్రికి లేదన్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం, ప్రాణ నష్టం జరిగిందని, రైతులు నష్ట పోయారని చెప్పారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం సోయి లేకుండా అందాల పోటీల విూద, మూసీ నదిపై రివ్యూలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో చర్చకు రావాల్సిన అనేక సమస్యలు ఉన్నాయని, మూడు రోజులు మాత్రమే సభను నడపాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. సీఎం చర్చలకు భయపడుతున్నారా అని ప్రశ్నించారు. నాలుగు వారాలపాటు అసెంబ్లీ నిర్వహించాలని ఏలేటి డిమాండన చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *