– సీఈవో సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎ న్నిక ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌ల పరిశీలనతో కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ఉపఎన్నికలో 59 మంది అభ్యర్థులు (నోటాతో కలిపి) పోటీలో ఉన్నందున 42 కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు కోసం ఈసీఐ ప్రత్యేక అనుమతి ఇచ్చిందని సీఈవో వివరించారు. మొత్తం ప్రక్రియ గరిష్ఠంగా 10 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. లెక్కింపు పనులను ఈసీఐ సాధారణ పరిశీలకులు పర్యవేక్షించనున్నారని, మొత్తం 186 మంది సిబ్బందిని సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను నియమించామని చెప్పారు. అప్‌డేట్స్‌ను ఎల్‌ఈడీ స్క్రీన్లు, ఈసీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ సెంటర్‌లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతి ఇచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ రోజున భద్రతకు పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినట్టు, కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈవో సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





