బాన్సువాడ ఘటన దురదృష్టకరం

– హిందువులంతా ఐక్యంగా పోరాడాలి
-హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు
– ఖమ్మంలో పేదల ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారు
– కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌విమర్శలు

కామారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 2: హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బాన్సువాడలో ఇటీవల జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. కామారెడ్డిలో సోమ‌వారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చేస్తోందని ఆరోపించారు. పెద్దలతో బేరసారాలు కుదుర్చుకుని వారి జోలికి వెళ్లడం లేదన్నారు. మూసీ ఒడ్డున గాంధీ విగ్రహం పేరిట, ఖమ్మంలోని భూదాన్‌ ‌భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బఫర్‌ ‌జోన్‌లో ఎన్ని ఇళ్లున్నాయి.. ఎన్ని కూల్చారు అనే దానిపై చర్చకు సిద్ధమా అని బండి ప్రశ్నించారు. తొమ్మిది రోజులుగా వికారాబాద్‌ ‌జిల్లా అనంతగిరి గుట్టల్లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు స‌మావేశంలో డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేసేందుకు కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారు.. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌రాహుల్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన పర్యటన పాకెట్‌ ‌మనీ కోసమేనా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్‌ ‌రూ.10 వేల కోట్లు ఇవ్వ గలదని సీఎం రేవంత్‌ ‌రెడ్డే చెప్పారన్నారు. ఒక్క తెలంగాణ నుంచే వెయ్యి కోట్లు గాంధీ కుంబానికి వెళ్తాయని ఆరోపించారు. కామారెడ్డి బాన్సువాడలో జరిగిన కలహాలలో జైలుకి పోయిన బాధితుల కుటుంబ సభ్యులను బండి పరామర్శించారు. ముఖ్యమంత్రి బలిసినోడిని వదిలిపెట్టి నిరుపేదల జోలికి పోతున్నారు.. రాహుల్‌ ‌గాంధీ చేస్తున్నది రాజకీయ పర్యటనా? లేక కలెక్షన్ల సక్షనా అని రాష్ట్రం చూస్తుందని అన్నారు. హైదరాబాద్‌ ‌లో ఫాతిమా కళాశాలను వదిలిపెట్టి ఖమ్మంలో కళాశాలలను కూల్చిన గొప్పతనం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిది. ముఖ్యమంత్రి పేదల జోలికి వస్తె అదే బోల్డోజర్లు తీసుకుని నీపైకి వస్తాం. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా కాంగ్రెస్‌ ‌పార్టీకి ఓటు వేసి మనం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లనే మనం ఈ గోస పడుతున్నాం. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మనం ఆలోచించి ఓటు వేయాలి. కామారెడ్డిలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై దాడి చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ దాడులు చేస్తే మేము సహించి ఊరుకోవడానికి బిఆర్‌ఎస్‌ ‌నాయకులం కాదు. దేశంలో 20 రాష్టాల్ల్రో అధికారంలో ఉన్నాం. అరాచకాలు, కూల్చివేతలు వెంటనే మానండి, ఇలాంటివి పునరావృతం అయితే మా ప్రణాళిక మేము సిద్ధం చేసుకుంటాం హెచ్చ‌రించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *