దేశంలోని పౌరులంతా భారతీయులే

– మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: స్వాతంత్య్రం వచ్చాక ప్రజలకు సంక్షేమ, అభివృద్ది ఫలాలను ప్రజలకు అందించాలనే సంకల్పంతో డాక్టర్ బి.ఆర్.అంబేడŠ్కర్ రాజ్యాంగాన్ని రచించారని, అది 1950 జనవరి 26వ తేదీ నుండి అమలులోకి వచ్చిందని తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కె.నివాస్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగ స్పూర్తితో మన దేశంలో అందరికీ సమాన హక్కులతో కుల, మత, లింగ, వర్ణ భేదాలు లేకుండా ప్రపంచంలో పరిపాలన అందిస్తున్న ఏకైక దేశం మనదేనని అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని కార్యాలయంలో సోమవారం జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషికీ జీవించే హక్కు, వైద్య, విద్య హక్కు, రక్షణ వ్యవస్థ, చట్టాలు, మొదలగు అంశాల గురించి రాజ్యాంగంలో పొందుపరిచారని వివరించారు. మన దేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థే మూలం అని అన్నారు. అన్నారు. ఆనాడు దళిత వర్గాలకు, పేద వర్గాలకు నష్టం వాటిల్లకుండా అంబేడ్కర్ ఆలోచించి అందిరికీ న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. కాగా, రాబోయే రోజులలో జర్నలిస్టుల సంక్షేమం, జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ద్వారా తెలంగాణ మీడియా అకాడమి దేశంలోనే మొదటిస్థానంలో ఉండేలా అకాడమి సిబ్బంది అందరం కలిసి పని చేద్దాం అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అకాడమి సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణచందర్ రావు, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, ఎమ్.కె.రహమాన్, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *