ఉగ్ర కుట్రకు కేరాఫ్‌ అల్‌ ‌ఫలాహ్‌ ‌వర్సిటీ

– విధ్వంస రచనకు రూమ్‌ ‌నంబర్‌ 17
– ఇక్కడి నుంచే ముష్కరుల పథక రచన

న్యూదిల్లీ, నవంబర్‌ 13: ‌దిల్లీ బాంబు పేలుడుఘటన నేపథ్యంలో అల్‌ ‌ఫలాహ్‌ ‌వర్సిటీ  పేరు తెరపైకి వొచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది. దర్యాప్తు అధికారులు వర్సిటీకి చేరుకొని ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక ఆధారాలు బయటపడ్డట్లు తెలుస్తోంది.మెడికల్‌ ‌కాలేజీలోని బాయ్స్ ‌హాస్టల్‌ ఉం‌డే 17వ నంబర్‌ ‌భవనం వీరి ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ భవనంలోని 13వ నంబర్‌ ‌గది కీలకంగా మారింది. ముజమ్మిల్‌కి చెందిన ఈ గది వైట్‌ ‌కాలర్‌ ‌టెర్రర్‌ ‌మాడ్యూల్‌ ‌కు రహస్య సమావేశ కేంద్రంగా పనిచేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దిల్లీ, సప రాష్ట్రాల్లో పేలుళ్లకు ఈ గది నుంచే కుట్ర చేసినట్లు తేలింది. యూనివర్సిటీ ల్యాబ్‌ ‌నుంచి కొన్ని రసాయనాలను తీసుకురావాలని ఉమర్‌, ‌ముజమ్మిల్‌ ‌ప్లాన్‌ ‌వేసినట్లుగా సమాచారం. ఈ గదిలో సోదాలు చేపట్టిన దర్యాప్తు అధికారులు కొన్ని కెమికల్స్‌తోపాటూ పెన్‌‌డ్రైవ్‌లు, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముజమ్మిల్‌ ‌గదితో పాటు ఉమర్‌కు చెందిన 4వ నంబరు గది నుంచి మూడు డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక విషయాలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. డైరీల్లో భారీ ఉగ్ర ప్లాన్లను గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.మొత్తం 32 వాహనాల్లో పేలుడు పదార్దాలను నింపాలని అనుమానిత ఉగ్రవాదులు ప్లాన్‌ ‌చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 8 మంది అనుమానితులు సుమారు నాలుగు లొకేషన్లలో పేలుడుకు పాల్పడాలని భావించినట్లు తెలుస్తున్నది. పేలుడు పదార్దాలను కొనుగోలు చేసేందుకు వైట్‌కాలర్‌ ‌డాక్టర్లు సుమారు రూ.26 లక్షల నిధి సేకరించినట్లు తెలుస్తున్నది. అనుమానితులు డాక్టర్‌ ‌ముజమ్మిల్‌ ‌గన్నై, డాక్టర్‌ అదీల్‌ అహ్మద్‌ ‌రాథర్‌, ‌డాక్టర్‌ ‌షహీన్‌ ‌సయ్యిద్‌, ‌డాక్టర్‌ ఉమర్‌ ‌నబీ ఆ డబ్బును పోగు చేశారు. అయితే ఆపరేషన్స్ ‌నిర్వహించేందుకు ఆ డబ్బును డాక్టర్‌ ఉమర్‌ ‌వాడినట్లు తెలుస్తున్నది. ఫరీదాబాద్‌ ‌టెర్రర్‌ ‌మాడ్యూల్‌, ఎ‌ర్రకోట పేలుడు ఘటనల్లో తీగ లాగే కొద్దీ భారీ ఉగ్ర కుట్ర బయటపడుతోంది. వీరు దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో దాడులకు పన్నాగం పన్నినట్లు తెలిసింది. ఇందుకోసం 8 మంది సూసైడ్‌ ‌బాంబర్లను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కేసుల్లో నిందితులు డాక్టర్‌ ఉమర్‌ ‌నబీ, డాక్టర్‌ ‌ముజమ్మిల్‌ ‌డైరీల్లో భారీ ఉగ్ర ప్లాన్లను గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. దిల్లీ పేలుడు ఘటన పై దర్యాప్తు చేపట్టిన అధికారులు హరియాణాలోని ఫరీదాబాద్‌లో గల అల్‌-‌ఫలా యూనివర్సిటీని జ్లలెడ పడుతున్నారు. ఇక్కడి మెడికల్‌ ‌కాలేజీలోని బాయ్స్ ‌హాస్టల్‌ ఉం‌డే 17వ నంబరు భవనం వీరి ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందులో ముజమ్మిల్‌కు చెందిన 13వ నంబరు గదిలోనే ఉగ్ర కుట్రలకు పథక రచన చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. యూనివర్సిటీ ల్యాబ్‌ ‌నుంచి కొన్ని రసాయనాలను తీసుకురావాలని ఉమర్‌, ‌ముజమ్మిల్‌ ‌ప్లాన్‌ ‌చేసినట్లు తెలిసింది. ఈ గదిలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని కెమికల్స్, ‌డిజిటల్‌ ‌పరికరాలు, పెన్‌‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, ముజమ్మిల్‌ ‌గదితో పాటు ఉమర్‌కు చెందిన 4వ నంబరు గది నుంచి మూడు డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక విషయాలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఆ డైరీల్లో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా జమ్మూకశ్మీర్‌, ‌ఫరీదాబాద్‌కు చెందిన వారని గుర్తించారు. దీంతోపాటు నవంబరు 8 నుంచి 12 వరకు తేదీలను ప్రస్తావించినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే వీరు దాడులకు పక్కా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా నాలుగు కీలక ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరపాలని నిందితులు ప్లాన్‌ ‌చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐ20, ఎకోస్పోర్ట్‌తో పాటు మరో రెండు పాత కార్లను కూడా సిద్ధం చేయాలని వారు ప్లాన్‌ ‌చేసినట్లు సమాచారం. ఇందులో ఐ20 కారులోనే ఎర్రకోట వద్ద పేలుడు జరగ్గా.. ఎకోస్పోర్ట్ ‌కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా రెండు కార్ల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ ప్లాన్‌ను అమలుచేసేందుకు 8 మందిని సిద్ధం చేసినట్లు ఆ డైరీల సమాచారంతో అధికారులు గుర్తించారు. ఒక్కో ప్రాంతానికి ఇద్దరు చొప్పున వెళ్లి పేలుళ్లు జరపాలని వీరు పన్నాగం పన్నినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ ఎనిమిది మందిలో ఉమర్‌, ‌ముజమ్మిల్‌తో పాటు డాక్టర్‌ అదిల్‌, ‌డాక్టర్‌ ‌షాహీన్‌ ‌కూడా ఉన్నట్లు తెలిపాయి. ఈ ఉగ్ర కుట్రను అమలుచేసే బాధ్యతను ప్రధానంగా ఉమర్‌కు అప్పగించినట్లు సమాచారం. ఇందుకోసం నిందితులు దాదాపు రూ.20 లక్షల వరకు నిధులు సేకరించి ఆ మొత్తాన్ని ఉమర్‌కు ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. ఈ డబ్బును వినియోగించి 20 క్వింటాళ్లకు పైగా ఎన్‌పీకే ఫెర్టిలైజర్‌ను గురుగ్రామ్‌, ‌నూహ్‌ ‌తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించాయి. ఈ పదార్థాలను వినియోగించి వారు ఐఈడీ బాంబులను తయారుచేయాలని ప్లాన్‌ ‌చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే, వీరి కుట్రలను పోలీసులు భగ్నం చేశారని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page