– చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్
మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. ఫేక్ కరెన్సీని నిర్మూలించాలని ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాటి చలామణి మాత్రం ఆగడం లేదు. కొత్తకొత్త ప్లాన్లు వేస్తూ పోలీసులనే బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా దొంగనోట్లు చెలామణి చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు ఓ ముఠా సభ్యులు. వారి గుట్టురట్టు చేసి కటకటాల వెనక్కి పంపారు పోలీసులు. నిందితుల నుంచి లక్షల రూపాయల ఫేక్ నోట్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లాలో ఫేక్ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 25న ఓ పెట్రోల్ బంకులో మూడు రూ.500 నోట్లు ఇచ్చారు ముఠా సభ్యులు. నోట్లపై ఒకే సీరియల్ నంబర్ ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు బంక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. తీగ పట్టుకుని లాగగా డొంక మొత్తం కదిలింది. ప్రధాన సూత్రధారి కానుగంటి క్రాంతి సహా 13 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5,98,500లు స్వాధీనం చేసుకున్నారు. 12 సెల్ ఫోన్లు, మూడు వాహనాలు సీజ్ చేశారు. ఆంధప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో తెలిసిన పరిచయాల ద్వారా ఫేక్ నోట్లను కేటుగాళ్లు చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈజీ మనీ కోసమే ఫేక్ కరెన్సీని చలామణి చేస్తున్నట్లు విచారణలో తేలింది. వారందరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





