– ఇరాన్ అణు కేంద్రంపై వైమానిక దాడులు
– నష్టం లేదని తెలిపిన ఇరాన్
– అంతర్జాతీయ ఉల్లంఘనేనని ఆరోపణ
టెహ్రాన్, మార్చి 21: దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. తాజా గా ఇరాన్ లోని నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడినట్టు స్థానిక మీడియా సంస్థ తస్నిమ్ తెలిపింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత నతాంజ్ అణు క్షేత్రంపై దాడులు చేయడం ఇది రెండోసారి. నతాంజ్ అణు క్షేత్రంపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడ్డాయని, అయితే రేడియో ధార్మిక పదార్థాల లీకేజీ జరగలేదని, పరి సర ప్రాంతాల టెహ్రాన్ తెలిపింది. ఈమేరకు ఇరాన్ ఇంధన మం త్రిత్వ శాఖ ప్రతినిధి ఎక్స్లో పోస్టు పెట్టా రు. చమురు సరఫరాపై ఆందోళనలు తగ్గిం చేందుకే యూఎస్ ప్రకటన చేసిందన్నారు. నతాంజ్ క్షేత్రంపై ఇజ్రాయెల్, అమెరికా దాడు లను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా, ఇజ్రాయెల్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం, ఇతర అణు భద్రత నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని పేర్కొంది. నేరపూరిత చర్యల్లో భాగంగానే నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడు ‘లకు దిగిన సంగతి తెలిసిందే. తాము జరిపిన దాడుల్లో ఇరాన్కు భారీ నష్టం వాటిల్లిందని, ఇక ఆ దేశానికి యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యం లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రకటించారు. నెతన్యాహు ప్రకటించిన కొద్ది గంటల్లోనే నతాంజ్ అణు కేంద్రంపై దాడులు జరగడం గమనార్హం. నతాంజ్ అణు కేంద్రం టెహ్రాన్కు దాదాపు 220 కిలోటర్ల దూరంలో ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



