న్యూదిల్లీ, జనవరి 21: దిల్లీలో గాలి నాణ్యత మరింతగా క్షీణించాయి. గతంకంటే గాలి నాణ్యతలు కొంత మెరుగుపడినప్పటికీ.. ఎక్యూఐ స్థాయిలు వెరీపూర్ కేటగిరీలోనే కొనసాగతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకు ఎక్యూఐ 339గా వద్ద నమోదైంది. దీంతో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) వీటి స్థాయిల్ని వెరీపూర్ కేటగిరీలో వర్గీకరించింది. మంగళవారం ఎక్యూఐ 395 స్థాయిల వద్ద నమోదైంది. నిన్నటికంటే ఈరోజుకి గాలి నాణ్యతలు మెరుగుపడ్డాయని సిపిసిబి వెల్లడించింది.కాగా, దిల్లీలో 30 వాతావరణ పర్యవేక్షణా కేంద్రాల్లో గాలి నాణ్యతలు ‘వెరీ పూర్’ కేటగిరీలోనే నమోదయ్యాయి. ఎనిమిది కేంద్రాల్లో పూర్ కేటగిరీలో ఎక్యూఐ స్థాయిలు నమోదైనట్లు సర్ యాప్ సమాచారం తెలిపినట్లు సిపిసిబి పేర్కొంది. ఇక దిల్లీలో జహంగిర్‌పూర్‌లో గాలి నాణ్యతలు పేలవంగా నమోదయ్యాయి. అక్కడ ఎక్యూఐ స్థాయిలు 390గా నమోదైనట్లు సిపిసిబి పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




