– మరింతగా క్షీణించినట్లు గుర్తింపు
– స్పోర్ట్సు యాక్టివిటీస్‌పై నిషేధం
– ప్రజలను హెచ్చరించిన అధికారులు
న్యూదిల్లీ, నవంబర్ 21: దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరుకుంది. పలు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గత నెల దిల్లీ – ఎన్‌సీఆర్ ప్రాంతాల్లోని 80 శాతం ఇళ్లలో విషపు గాలి కారణంగా కనీసం ఒక సభ్యుడు అనారోగ్యానికి గురైనట్లు సర్వేలు చెబుతున్నాయి. గాలి కాలుష్యం కారణంగా ప్రజల ఆయుర్దాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు రక్షణ లభించటం లేదు. మాస్కులు, ఎయిర్ ప్యూరిఫైయర్లు కొంత మేరకు మాత్రమే రక్షణ ఇస్తాయని, కాలుష్యాన్ని నియంత్రించడానికి పాలసీలో మార్పులు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో దిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పోర్టస్ యాక్టివిటీస్‌పై నిషేధం విధించింది. దిల్లీలో కాలుష్యం పెరుగుతుండటంతో స్పోర్టస్ యాక్టివిటీస్ ఆపేయాలని రెండు రోజుల క్రితం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయింది. సాధారణంగా దిల్లీలోని స్కూల్స్ చలికాలంలో స్పోర్టస్ ట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. కాలుష్యం పెరగటంతో నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించే క్రీడలను నిర్వహించొద్దని దిల్లీ ప్రభుత్వం స్కూళ్లను ఆదేశించింది. ఇకపోతే దిల్లీలో గాలి నాణ్యతలు క్షీణించాయి. దిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యతలు నమోద్యాయి. దీంతో ఆ గాలి ప్రాణాంతకంగా మారుతుందని పలువురు నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో 80 శాతం నివాసితులు గాలి నాణ్యతలు క్షీణించడం వల్ల అనారోగ్యాలపాలవుతున్నారు. కనీసం కుటుంబంలో ఒక్కరైనా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని పలు సర్వేలు వెల్లడించాయి. మాస్క్‌లు, ఎయిర్ ప్యూరిఫైయైర్‌లు కొంత రక్షిస్తున్నప్పటికీ.. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏడాది పొడవునా కచ్చితమైన విధాన మార్పు అవసరమని వైద్యులు సూచించారు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయానికి ఎక్యూఐ 370 స్థాయి వద్ద నమోదైంది. దీంతో వీటి స్థాయిల్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెరీపూర్ కేటగిరీలో వర్గీకరించింది. దిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఎక్యూఐ తీవ్ర స్థాయిలో నమోదైంది. చాందినీ చౌక్, ఆనంద్ విహార్, ముండ్కా, బవానా, నరేలా, డిటియు- వజీర్‌పూర్‌లలో 400కి పైగా ఎక్యూఐ నమోదైంది. 18 పర్యవేక్షణా కేంద్రాల్లో 400 పైగానే ఎక్యూఐ నమోదైంది. గత కొన్ని రోజుల్లోనే కాకుండా.. వొచ్చే వారంలో ఆరు రోజులు కూడా తీవ్ర ప్రమాదకర స్థాయిలోనే గాలి నాణ్యతలు నమోదయ్యే అవకాశం ఉందని భూశాస్త్రాల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. గాలి కదలికలు సరిగ్గా లేకపోవడం, శీతాకాలం కారణంగా గాలి నాణ్యతలు ప్రమాదకర స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దిల్లీలో గాలి ఎంత కాలుష్యంగా ఉందో నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలే నిదర్శనం. దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరిగిపోవటానికి పంట వ్యర్థాలను తగలబెట్టడం ప్రధాన కారణం అవుతోంది. దిల్లీ చుట్టు పక్కల ఉండే రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో పంట వ్యర్థాలను తగలబెడుతూ ఉన్నారు. దాని కారణంగా దిల్లీలో కాలుష్యం పెరుగుతోంది. అధికారులు పోలీస్ కేసులు నమోదు చేస్తున్నా.. భారీ ఫైన్లు వేస్తున్నా కూడా రైతులు మారటం లేదు. పంట వ్యర్థాలను కాలుస్తూనే ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





