– పాక్ మిగ్‌లను కూల్చేశాం: ఎయిర్ చీఫ్ మార్షల్
న్యూదిల్లీి, అక్టోబర్ 3 : ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వాయుసేన సత్తా ఎలాంటిదో ప్రపంచం చూసిందని వాయుసేన అధిపతి ఏపీ సింగ్ తెలిపారు. శత్రువుల స్థావరాలను గురిచూసి కచ్చితంగా కొట్టామని, ఆ సమయంలో భారత్ శక్తిని ప్రపంచ దేశాలు చూశాయని పేర్కొన్నారు. త్రివిధ దళాల సమన్వయంతో పాక్‌కు చెందిన పది ఫైటర్ జెట్ విమానాలను ధ్వంసం చేశామన్నారు. వాటిలో ఎఫ్`16, ఎఫ్ `17 యుద్ధ విమానాలు ఉన్నట్లు తెలిపారు. పాక్‌లోని దాదాపు 300 కి.విూ.ల లక్ష్యాలను ఛేదించినట్లు ఆ దేశాన్ని మోకాళ్లపై కూర్చొనేలా చేశామన్నారు. ఆపరేషన్ సమయంలో కేంద్రం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడంతో మన సైన్యం శత్రుదేశానికి చుక్కలు చూపించిందని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాలతో ఘర్షణలు తలెత్తిన సమయాల్లో వాటిని ఎదుర్కోవాలి, పరిష్కరించుకోవాలనే విషయాలను భారత్ నుంచి నేర్చుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించారు. భవిష్యత్తు సవాళ్లను అధిగమించేందుకు రక్షణరంగంలో స్వావలంభన కోసం ’సుదర్శన చక్ర’ను తయారుచేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ఇప్పటికే త్రివిధ దళాలు పనిని ప్రారంభించాయని తెలిపారు. ఇకపోతే మనం ఆపరేషన్ సిందూర్ తరవాత ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామన్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కనేందుకు కూడా సన్నద్దంగా ఉన్నామన్నారు. మన అస్త్రశస్త్రాలు అన్నీ గేమ్ ఛేంజర్‌లేనని అన్నారు. స్వయంసహాయక శక్తితో భారత్ తిరుగులేని సామర్థ్యం సాధించిందని తెలిపారు. మన ఆయుధ సంపత్తి తిరుగులేనిదని సింగ్ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


