జూబ్లీహిల్స్‌లో గెలుపే లక్ష్యంగా సాగాలి

– చిన్న ఏమరుపాటు కూడా పనికి రాదు
– ఈ మూడు రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి
– ప్రతి వోటరును కలిసి మన వాయిస్‌ ‌వినిపించాలి
– బిఆర్‌ఎస్‌ ‌దుష్ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టాలి

– మంత్రులు, పార్టీ నేతలకు సిఎం దిశానిర్దేశం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నాయకులకు సూచించారు. ఇక్కడ ఖచ్చితంగా గెలవబోతున్నామని, అందువల్ల మెర్జీ కోసం కృషి చేయాలన్నారు. అలాగే ఓటింగ్‌ ‌శాతం పెరిగేలా ప్రతి ఒక్కరూ బూత్‌కు వొచ్చి వోటేసేలా చూసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సక్షలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి నాక్షి నటరాజన్‌, అం‌దుబాటులో ఉన్న మంత్రులు పాల్గొన్నారు. ఇప్పటికే మంత్రులు, సీనియర్‌ ‌నాయకులు, ఎమ్మెల్యేలు గడప గడపకూ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా గత నెల 31, ఈ నెల 1, 4, 5 తేదీల్లో నియోజక వర్గంలోని పలు డివిజన్లలో రోడ్‌ ‌షోలు నిర్వహించడంతోపాటు కార్నర్‌ ‌సమావేశాలు నిర్వహించారు. పోలింగ్‌ ‌తేదీ దగ్గర పడుతుండడంతో.. క్షేత్ర స్థాయి పరిస్థితులు, సర్వే నివేదికలు, పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలు, వ్యూహ, ప్రతి వ్యూహాలు తదితర అంశాలపై సక్ష చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మంత్రులందరికి బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి….ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని దిశానిర్దేశంచేసినట్లు తెలుస్తోంది.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలువబోతున్నామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి మంత్రులకు సూచించారు. మంత్రులు, పార్టీ నాయకులు అందరూ మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ‌చేస్తున్న ఫేక్‌ ‌ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. సోషల్‌ ‌డియా వేదికగా బీఆర్‌ఎస్‌ ‌చేస్తున్న ప్రచారానికి గట్టిగా  కౌంటర్‌ ఇవ్వాలని సూచించారు. మంత్రులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రోజుకో సర్వేను వదులుతూ ప్రజలను, వోటర్లను బీఆర్‌ఎస్‌ ‌సోషల్‌ ‌డియా గందరగోళానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఫీల్డ్ ‌లో కాంగ్రెస్‌ ‌కు బలం ఉందని, నవీన్‌ ‌యాదవ్‌ ‌మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని గ్రౌండ్‌ ‌రిపోర్టులు చెబుతున్నాయని అన్నారు. ప్రచారానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉందని, ప్రతి గంటనూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి వోటరుకు మన వాయిస్‌ ‌చేరాలని అన్నారు. మనం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చేర్చే బాధ్యతను మంత్రులు, పార్టీ నాయకులు తీసుకోవాలని సూచించారు.  రాబోయే మూడు రోజుల్లో పోల్‌ ‌మేనేజ్మెంట్‌ ‌పై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటి వరకు సాగిన ప్రచారంపై రివ్యూ చేశారు. ఈ సెగ్మెంట్‌ ‌లో పోలింగ్‌ ‌పర్సంటేజీ పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం ఈ రివ్యూలో సూచించినట్టు సమాచారం.   ఇక్కడ మొత్తం 4,01,365 మంది వోటర్లున్నారు. ఇందులో పురుషులు 2,08,561మంది, మహిళలు 1,92,779 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. వీళ్లంతా 139 పోలింగ్‌ ‌కేంద్రాల్లోని  407 పోలింగ్‌ ‌బూత్‌ ‌లలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ చాలా తక్కువగా పోలింగ్‌ ‌శాతం నమోదవుతోంది.ఇక్కడ 2009 లో 52.76శాతం, 2014లో 50.18, 2018లో 45.59 2023లో 47.49 శాతం పోలింగ్‌ ‌నమోదవుతోంది. దానిని పెంచడం, ప్రతి వోటరు పోలింగ్‌ ‌కేంద్రం వరకూ వచ్చేలా చర్యలు తీసుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం చెప్పినట్టు  సమాచారం. దీంతో  పాటు బస్తీల వారీగా పరిస్థితిని కూడా సీఎం సక్షించినట్టు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *