– ఎన్నికల హామీల అమలుకు నిలదీస్తున్న మహిళలు
– ఐద్వా సమావేశంలో ప్రొఫెసర్ శాంతాసిన్హా
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి
మహిళా సాధికారతలో ప్రధానంగా పనిచేసే హక్కు, విద్యా హక్కు, ఆరోగ్య హక్కు విషయంలో అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. కులం, లింగం, తరగతి వంటి విభజన ద్వారా అత్యంత అవమానకరమైన, ఆసురక్షిత పనులకు మహిళలను పరిమితం చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకించాలని కోరారు. దేశవ్యాప్తంగా అశా వర్కర్లు, అంగన్వాడీలు చేస్తోన్న పోరాటాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. అనేక రాష్ట్రాల్లో 8వ తరగతి తర్వాత పెద్ద సంఖ్యలో బాలికలు చదువు మానేస్తున్నారని, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు లేకపోవడం, రక్షణలేదని ప్రయాణం వంటి కారణాలు శ్రామిక తరగతి కుటుంబాలకు విద్యను దూరం చేస్తున్నాయని, ఫలితంగా బాల్య వివాహాలు పెరుగుతున్నాయని వివరించారు. దళిత, ఆదివాసీ బాలికలు ఈ ముప్పును తీవ్రంగా ఎదుర్కొంటున్నారన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు ప్రభుత్వాలవేనని స్పష్టం చేశారు. దీనికోసం పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, పని స్థలం నుంచి వీధి వరకు సమిష్టి పోరాటాలకు ‘ఐద్వా’ మహాసభరూపకల్పన చేయాలని అభిలాషించారు. ఐద్వా అఖిల భారత మహాసభలో పలువురు సౌహార్ద సందేశాలు ఇచ్చారు. ఆలిండియా మహిళా సాంస్క•తిక సంఘటన్ అధ్యక్షులు శోభ మాట్లాడుతూ 21వ శతాబ్దంలో కూడా ఆడపిల్లను పుట్టనివ్వని దుస్థితిని చూస్తున్నామన్నారు. మహిళల పట్ల సమాజ దృక్పథం ఇంకా పాతకాలపు ఆలోచనలతోనే ఉందన్నారు.. భూస్వామ్య విలువలే అనుసరించబడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు కరువయ్యాయన్నారు. పెట్టుబడిదారీ విధానం వల్ల పేదరికం, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. పాత కాలపు ఆలోచనలను విడనాడి భూస్వామ్య, పెట్టుబడిదారీ భావజాలాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని కోరారు. సమాజంలోని సమానత్వ భావనకు పెను ముప్పు పొంచి ఉందని ఆలిండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ కార్యదర్శి నాగమణి అన్నారు. మహిళలు పోరాటాల ద్వారా సాధించుకున్న పురోగతిని, కష్టార్జితాన్ని నిర్వీర్యం చేసేలా చట్టాలను మారుస్తున్నారని విమర్శించారు. ఆశారాం బాపు, కుల్దీప్ సింగ్ వంటి లైంగిక దాడి నిందితులను విడుదల చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.. రాజకీయాల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం అనేది అందని ద్రాక్షలాగే ఉందన్నారు. తెలంగాణ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి విహారెడ్డికి సన్మానం ఐద్వా అఖిల భారత మహాసభ వేదికపై తెలంగాణ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి విహారెడ్డిని నాయకులు సన్మానించారు. ఆమె మరింత రాణించాలని ఆకాంక్షించారు.





