-పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ ఇంజెక్షన్
- ఫిర్యాదుతో రంగంలోకి దిగి అరెస్ట్ చేసిన పోలీసులు
మేడ్చల్ మల్కాజ్‌గిరి, ప్రజాతంత్ర, మార్చి 14: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం ప్రాంతంలో సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవడం లేదనే కోపంతో ఓ యువకుడు ప్రాణాంతకమైన ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఇంజక్షన్ ద్వారా యువతికి ఎక్కించాడు. సినిమా తరహాలో జరిగిన ఈ పైశాచిక ఘటన ఇప్పుడు కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మనోహర్ బాధితురాలిని కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. మనోహర్‌కు ఎయిడ్స్ పాజిటివ్ ఉందని తెలియడంతో ఆ యువతి అతడితో పెళ్లికి నిరాకరించింది. తన ప్రాణాలను పణంగాపెట్టి పెళ్లి చేసుకోలేనని స్పష్టం చేసింది. తన వ్యాధి గురించి తెలిసి పెళ్లికి నో చెప్పిందనే కోపంతో మనోహర్ ఉన్మాదిలా ప్రవర్తించాడు. ’నేను ఎలాగూ చనిపోతాను.. నువ్వు కూడా నాతోనే రావాలి’ అనే వికృత ఆలోచనతో, తన రక్తాన్ని లేదా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల రక్తాన్ని ఇంజక్షన్ ద్వారా ఆ యువతి శరీరంలోకి ఎక్కించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఘట్‌కేసర్ పోలీసులు వెంటనే స్పందించారు. మనోహర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రక్తాన్ని అతను ఎక్కడినుంచి సేకరించాడు.. దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలిని వెంటనే హాస్పిటల్‌కి తరలించి అత్యవసర చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రేమ పేరుతో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై కఠిన చట్టాలు ప్రయోగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




