దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే

– రాష్ట్రపతి అనుమతి కోసం ఎదురు చూస్తున్న బీరిజర్వేషన్ల బిల్లు
– రాహుల్‌ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం పోరాటం
– ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

న్యూదిల్లీ, జూలై24: తెలంగాణలో శాస్త్రీయ్రంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉద్ఘాటించారు. తెలంగాణ సర్వే ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యాసంస్థల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సిఫారసు చేస్తోందని తెలిపారు. బీసీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తోందని వెల్లడిరచారు. ఈ చరిత్రాత్మక ప్రయత్నంలో కృషి చేసిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని బృందానికి ఖర్గే కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రిమండలి, ఎంపీలకు ఖర్గే ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మల్లికార్జున ఖర్గే పోస్ట్‌ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ సామాజిక న్యాయం 2.0 ఉద్యమాన్ని ప్రారంభించిందని, బలహీనవర్గాల కోసమే ఈ పోరాటమని నొక్కిచెప్పారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ నిరంతర పోరాటం చేస్తోందని ఉద్ఘాటించారు. దశాబ్దాలుగా పక్కకు నెట్టివేయబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాల ప్రజల గళంగా కాంగ్రెస్‌ పనిచేస్తోందని ఖర్గే స్పష్టం చేశారు. దేశ జనాభాలో మెజార్టీ సంఖ్య అయినా కార్పొరేట్‌ బోర్డులు, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, ఉన్నత విద్యాసంస్థల్లో వర్ణహీనత కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో కూడా అన్యాయం జరుగుతోందని, ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారని గుర్తుచేశారు. 80 శాతం ఓబీసీ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాలీగా ఉన్నాయని, అలాగే 83 శాతం ఎస్టీ పోస్టులు ఖాలీగా ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా జాతీయ కుల గణాంకాల సక్ష జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రజల ఒత్తిడికి లోనై కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, అయినా 50 శాతం రిజర్వేషన్‌ పరిమితిని ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. దశాబ్దాలుగా అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాల ప్రజల గొంతుకగా కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తుందన్నారు. దిల్లీిలోని ఖర్గే నివాసంలో రాహుల్‌ గాంధీ, ఖర్గేలతో తెలంగాణ నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా సంస్థలలో ఓబీసీలకు 42శాతం రిజర్వేషన్లు సిఫారసు చేసిందని.. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నదని ఆయన గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *