ఐదు రాష్ట్రాలకు ఏఐసిసి ఎన్నికల పరిశీలకుల నియామకం

న్యూఢిల్లీ, జ‌న‌వ‌రి 7 : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు సీనియర్ పరిశీలకులను నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సన్నాహకాలు, పార్టీ బలోపేతం, సమన్వయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు అనుభవజ్ఞులైన నేతలకు బాధ్యతలు అప్పగించింది.
అస్సాం రాష్ట్రానికి ఎన్నికల పరిశీలకులుగా మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, బంధు తిర్కీలను ఏఐసిసి నియమించింది. కేరళ రాష్ట్రానికి పరిశీలకులుగా రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, కె.జె.జార్జ్, రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్ఢి, యువ నేత కన్హయ్య కుమార్లను నియమించారు. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖాజీ మొహ మ్మద్ నిజాముద్దీన్లను పరిశీలకులుగా నియమించారు. పశ్చిమ బెంగాల్ కు సుదీప్ రాయ్ బర్మాన్, షకీల్ అహ్మద్ ఖాన్, ప్రకాష్ జోషిలను ఎన్నికల పరిశీలకులుగా ఏఐసిసి ప్రకటించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *