– కేసీఆర్ కుటుంబానికి ఇది సరిపోతుంది
– అప్పులు చేసి దోచుకోవడంలో అందెవేసిన చేయి
– కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: తెలంగాణ (Telangana) రాష్టాన్న్రి కేసీఆర్ (KCR) అడ్డంగా దోచుకున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) మండిపడ్డారు. ఎంత దొరికితే అంత దోచుకున్నారని, అప్పులు తెచ్చి వాటిల్లోనూ కవిూషన్లు దండుకున్న ఫ్యామిలీ వారిదని మండిపడ్డారు. శుక్రవారం ఇక్కడ గాంధీ భవన్(Gandhi Bhavan)లో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఇంకా చెప్పాలంటే అంచనా వేయలేనంతగా రాష్టాన్న్రి దోచారని తెలిపారు. అవినీతి ఎలా చేయాలో అనే యూనివర్సిటీకి కేసీఆర్ ప్రొఫెసర్ అని అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల ఖజానా దోచుకోవడంలో కేసీఆర్ ఫ్యామిలీ దిట్ట అని అన్నారు. రాష్టాన్న్రి అడ్డగోలుగా దోచుకొని సుద్దపూసలాగా నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. అలీబాబా నలభై దొంగలు అనే టైటిల్ కేసీఆర్ ఫ్యామిలీకి కరెక్ట్ సెట్ అవుతుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. నువ్వు నా క్యారెక్టర్ అంచనా వేయలేవని, రాష్ట్రంలో ఎవర్ని అడిగినా నా క్యారెక్టర్ గురించి చెబుతారని అన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఉన్నంత ఆస్తి నా వద్ద ఉంటే ప్రజలకి ఎప్పుడో పంచేసే వాడినన్నారు. పంచే గుణం మా అమ్మనాన్న నాకు ఇచ్చిన ఆస్తి అని చెప్పారు. భవిష్యత్తులో నేను రూ.వేల కోట్లు సంపాదించినా వాటిని ప్రజలకే పంచుతానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎలాంటి వాడినో కేసీఆర్, హరీష్‌రావుని అడిగి తెలుసుకోవాలంటూ ప్రభాకర్ రెడ్డికి సూచించారు. నా చుట్టూ పేదలు ఉంటారని.. నా వద్దకు క్యాన్సర్ పేషెంట్లు సైతం వస్తారని చెప్పారు. నేనేమైనా ప్యాకేజీల లీడర్‌నా అంటూ బీఆర్‌ఎస్ నేతలను జగ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు. నేనేమి బీ ఫారంలు కొనుకొని రాలేదని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ పార్టీ విూలాగా ప్రైవేట్ కంపెనీనా అని వారిని నిలదీశారు. ఇసుక దందాలతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని భూములు, చెరువులు కబ్జా చేసింది బీఆర్‌ఎస్ నాయకులేనని ఆరోపించారు.



