వ్యవసాయ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు నాణ్యమైన విద్య

– వ్యవసాయ వర్సిటీతో పూలే గురుకుల సొసైటీ ఒప్పందం
– బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో కీలక సమావేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: మహాత్మా జ్యోతిరావు బాపూలే గురుకుల సొసైటీ, ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారుల కీలక సమావేశం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన మంగళవారం జరిగింది. మహాత్మా జ్యోతిరావు బాఫూలే వ్యవసాయ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు మరింత నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయంతో ఒప్పందానికి కసరత్తు గురించి చర్చించారు. కరీంనగర్‌, వనపర్తిలలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే వ్యవసాయ డిగ్రీ కళాశాల ద్వితీయ, తృతీయ, చివరి సంవత్సరం విద్యార్థులకు వ్యవసాయ విశ్వవిద్యాలయ అధ్యాపకుల సమక్షంలో బోధన జరిపేందుకు నిర్ణయించారు. అలాగే ఆ డిగ్రీ కాలేజీల విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ, విద్యార్థులకు ఫీల్డ్‌ విజిట్‌, మౌలిక సదుపాయాల కల్పన, ల్యాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కళాశాలల్లోనే జరిగేలా కసరత్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి సెక్రటరీ బుద్దా ప్రకాష్‌, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్‌, రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జానయ్య, ఎంజేపీ గురుకుల సెక్రటరీ సైదులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *