ఈయూతో ఒప్పందం.. దేశానికి మేలు

– అమెరికాతో ఒప్పందం ఏదీ లేదు
– వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్

న్యూదిల్లీ, జనవరి 31 :యూరోపియన్ యూనియన్(ఈయూ)తో భారత్ ఇటీవల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నం దున అమెరికాతో కూడా కుదుర్చుకుంటుందా అనే ప్రశ్నకు భారత వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ లేదని జవాబిచ్చారు. ఆయన ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా 50 శాతం పన్నులు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికా బెదిరింపులకు లొంగి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి భారత్ లొంగిపోయిందనే వార్తలొచ్చాయి. అయితే అమెరికాతో వాణిజ్య ఒప్పందం ముగింపు దిశగా సాగుతుందని గోయల్ తాజాగా అన్నారు. ఈయూతో భారత్ కుదుర్చుకున్నది మంచి ఒప్పందం.. ఈ ఒప్పందం విషయంలో మేము చాలా చురుగ్గా పాల్గొన్నాం.. ఈ ఒప్పందంపై ఇరుపక్షాలు సంతృప్తి చెందాయి.. ఇది ఎప్ప్పుడు అమల్లోకి వస్తుందో తేదీని త్వరలో ప్రకటిస్తాం అని ఆయన చెప్పారు. కాగా, అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం చేసుకుంటుందా అనే ప్రశ్నకు అమెరికాతో ఒప్పందం విషయంలో కానీ, ఆ దేశంతో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు కానీ ఏమీ లేవని నేనకుంటున్నాను.. కానీ ప్రస్తుతం మేము అమెరికాతో ఒప్పందం చేసుకోకూడదని అనుకుంటున్నాము.. ఆ దేశంతో ఒప్పందం ముగించాలనే ఆలోచిస్తున్నాము అని గోయల్ సమాధానమిచ్చారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ ఏడాది మార్చిలో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో కెనడాతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశముందని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *