అత్తాపూర్‌లో అడ్వకేట్ దారుణ హత్య

– కిరాతకంగా హత్య చేసిన బావమరుదులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: నగరంలోని అత్తాపూర్‌లో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు గురయ్యారు. సులేమాన్ నగర్‌లోని తన కార్యాలయంలోనే ఖదీర్‌ను అతని మొదటి భార్య తమ్ముళ్లు అతి కిరాతకంగా చంపేశారు. పలుమార్లు కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఖదీర్‌కు రెండు పెళ్లిళ్లు జరిగాయి. రెండో వివాహం తర్వాత మొదటి భార్య దగ్గరకు రావడం లేదు. ఈ కోపంతో బావ ఖదీర్‌పై ఇద్దరు బావమరుదులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఖదీర్ తన కార్యాలయంలో ఉన్న సమయంలో అక్కడకు వచ్చిన వారు మొదట రాడ్‌తో తలపై బలంగా కొట్టారు. దాంతో మహహ్మద్ ఖదీర్ కుప్పకూలిపోగా ఆపై కత్తులతో ఆరుసార్లు పొడిచారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాల సేకరిస్తోంది. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అడ్వకేట్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుల కోసం ± గాలిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *