నగరంలో కల్తీ నూనె దందా

– వాడేసిన నూనె ప్యాకెట్లలో నింపి అమ్మకం
– ముఠాను గుర్తించి పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి31:హైదరాబాద్‌లో కల్తీ వంట నూనె దందా తీవ్ర కలకలం రేపుతోంది. హైటెక్‌ ‌సిటీలో కల్తీ వంట నూనె విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. హోటళ్లలో వాడిన వంటనూనెను కిలోకు రూ.20కు సేకరిస్తున్న ముఠా… దాన్ని వీధి వ్యాపారులకు రూ.70కు అమ్ముతున్నట్లు బయటపడింది. లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ముఠా గుట్టు బయటపడింది. నాచారం ప్రాంతంలో శుద్ధి పేరుతో మళ్లీ ప్యాకెట్లలో నింపుతూ దందా చేస్తున్నట్లు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన మాదాపూర్‌ ‌పోలీసులు… కల్తీ నూనె సేకరిస్తున్న వ్యక్తులను అరెస్ట్ ‌చేశారు. మాదాపూర్‌, ‌గచ్చిబౌలి ప్రాంతాల్లోని రెస్టారెంట్ల నుంచి వాడిన నూనెను సేకరించి.. కర్ణాటక రిజిస్ట్రేషన్‌ ఆటోలో వందల లీటర్లు తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20 డబ్బాల్లో కల్తీ నూనెను గుర్తించారు. నిందితులు సరైన పత్రాలు చూపించలేక తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరకు వీధి వ్యాపారులకు కల్తీ వంట నూనెను అమ్ముతున్నట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.
————————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *