వీధి కుక్కలను దత్తత తీసుకోండి

– అహింస సందేశంతో స్ట్రే డాగ్ అడాప్షన్
– కుక్క పిల్లను దత్తత తీసుకున్న మంత్రి సీతక్క
– కుక్కలను చంపిన సర్పంచ్‌లపై చర్యలు తీసుకున్నాం

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: వీధి కుక్కలను దత్తత తీసుకోవడం ద్వారా వాటికి జీవించే హక్కును కల్పించడమే కాక సమాజంలో మానవత్వాన్ని పెంపొందించవచ్చని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ పేర్కొన్నారు. డాగ్ అడాప్షన్ కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క హజరయ్యారు. సురేఖ చేతుల మీదుగా స్వదేశీ కుక్క పిల్లను మంత్రి సీతక్క దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచారు. ఎంపీ రేణుకా చౌదరి మంత్రి సీతక్క చేతుల మీదుగా కుక్క పిల్లను దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అహింసా సిద్ధాంతాన్నే అనుసరించిందని స్పష్టం చేశారు. అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రతి ప్రాణికీ జీవించే హక్కు ఉందని, విశ్వాసానికి మారు పేరు కుక్క అని అన్నారు. నగరం నడిబొడ్డున జీహెచఎంసీ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇంట్లో ఒక కుక్క ఉంటే భద్రతా భావం కలుగుతుందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొందరు సర్పంచ్‌లు కుక్కలను చంపిన సంఘటనలను ప్రస్తావిస్తూ ఆ సంఘటనలను ప్రభుత్వం ఖండించిందని, సంబంధితులపై చర్యలు కూడా తీసుకున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అలాంటి తప్పులను ప్రభుత్వానికి అంటగట్టడం భావ్యం కాదని, పార్లమెంటులో లేదా దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు. ఎవరూ కుక్కలను చంపకూడదని, నియంత్రణ చర్యలు పాటిస్తూ మానవత్వంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎన్నో స్వదేశీ డాగ్ బ్రీడ్స్ ఉన్నాయని, అందరూ ఇండియన్ డాగ్స్‌ను దత్తత తీసుకోవాలని కోరారు. ఇంటి కుక్క ఎప్పుడూ తన యజమానికి హాని చేయదని, విశ్వాసంతో కాపాడుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి, జీహెచఎంసీ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *