– గ్లోబల్ ట్రెండ్స్ అవకాశాలపై చర్చలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్లోబల్ ట్రెండ్స్ అవకాశాలపై ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై శంతను నారాయణ్ చర్చించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్‌కు సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు. తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్‌గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఎకానమీపై ఏఐ రెవల్యూషన్ ప్రభావం, రాబోయే రోజుల్లో ఏఐని సమర్ధవంతంగా వినియోగించుకునే అంశాలపై నారాయణ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ చర్చించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని ఆయనను కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





