ఆదిత్య సంస్థకు అనుమతుల పునరుద్ధరణ

– హైకోర్టు తీర్పు మేరకే నిర్ణయం
– హెచ్‌ఎండీఏ వివరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: హైకోర్టు తీర్పుననుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఆదిత్య నిర్మాణ సంస్థకు అనుమతులను పునరుద్ధరించామని, ఇందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని హెచ్‌ఎండీఏ తెలిపింది. ఆదిత్య కేడియా రియాల్టర్స్‌ కంపెనీకి గండిపేట మండలంలోని మంచిరేవులలో 9.19 ఎకరాల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి హెచ్‌ఎండీఏ 2022లోనే అనుమతులు ఇచ్చింది. అయితే మూసీ నది బఫర్‌ జోన్‌ను ఆక్రమించి అక్కడ రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించినట్లు 2023 జూలై 3న హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు చేపట్టిన సంయుక్త తనిఖీలో తేలింది. 2 ఆగస్టు 2023 నాడు ఆ సంస్థకు హెచ్‌ఎండీఏ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేనందున 18 ఆగస్టు 2023న భవన నిర్మాణ అనుమతులను రద్దు చేసి రిటైనింగ్‌ వాల్‌ను తొలగించాలని హెచ్‌ఎండీఏ ఆదేశాలు జారీ చేసింది. అనుమతుల రద్దును సవాలు చేస్తూ ఆదిత్య సంస్థ హైకోర్టుకు వెళ్లింది. మరోసారి జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులననుసరించి 26 ఫిబ్రవరి 2024న అధికారులు చేపట్టిన జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌లో ఆ సంస్థ రిటైనింగ్‌ వాల్‌ను తొలగించినట్లు తేలింది. అనుమతులు పునరుద్ధరించాలని 1 మార్చి 2024న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో భవన నిర్మాణ అనుమతులను పునరుద్ధరిస్తూ హెచ్‌ఎండీఏ 20 జూన్‌ 2024న ఉత్తర్వులు జారీ చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *