ఫీజు బకాయిల పాపం బిఆర్‌ఎస్‌దే

– నాలుగేళ్లపాటు చెల్లించకుండా పెండింగ్‌
-‌ మండిపడ్డ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబరు 15: విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ ‌బకాయిల పాపం ముమ్మాటికీ బిఆర్‌ఎస్‌దేనని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌చెల్లించలేదని విమర్శించారు. నాలుగేళ్లు పెండింగ్‌లో ఉంచడం వల్లే ఇప్పుడు ప్రభుత్వంపై భారం పెరిగిందని తెలిపారు. ఫీజులు ఎందుకు చెల్లించలేదో చెప్పాలన్నారు. ఇవన్నీపక్కనెట్టి బురద జల్లుతున్నారని మండిపడ్డారు. పల్లెల్లోనే కాదు.. పట్టణాల్లోనూ భారత రాష్ట్రసమితికి ప్రజల ఆదరణ లేదన్నారు. దుర్గం చెరువుపై కేబుల్‌ ‌బ్రిడ్జి నిర్మాణం తప్ప.. తెలంగాణకు ఆ పార్టీ చేసిందే లేదని ఆక్షేపించారు. కేటీఆర్‌ ‌భాష, సంస్క•తి బాగాలేదని.. సీఎంపై వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు.యూరియా విషయంలో భారత రాష్ట్ర సమితి దుష్ప్రచారం చేస్తోందని ఆది శ్రీనివాస్‌ ‌మండిపడ్డారు. సరిపడా యూరియాను ఇవ్వని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రైతుల పక్షాన మోదీని, కేంద్రాన్ని భారత రాష్ట్ర సమితి నేతలు ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న ఆ పార్టీ నేతలు బీజేపీకి భయపడుతున్నారని ఆరోపించారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే.. కేసులు బిగుసుకుంటాయని భారత రాష్ట్ర సమితిలో భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *