– సికింద్రాబాద్‌పై పోరాటం ఆపేది లేదు
– ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బిఆర్‌ఎస్ నేత కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి17:హైదరాబాద్, సికింద్రాబాద్‌కు ఎంతో చరిత్ర ఉందని.. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తొలగించే విధంగా చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం.. ప్రత్యక్షంగా తుగ్లక్ అంటే ఎలా ఉంటాడో కనిపిస్తున్నదని విమర్శించారు. మొట్టమొదటి పని టీఎస్‌ను టీజీగా చేశారు.. దీనివల్ల ఏ పేదవాడికి న్యాయం జరిగిందో తెలియదు.. ప్రజల దగ్గరికి పాలన పోవాలని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలని వీకేంద్రీకరణను ఒక విశాల దృక్పథంతోనే కేసీఆర్ ప్రారంభించారని.. కొత్త గ్రామాలు మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారని, హైదరాబాదులోనూ వార్డులను జోన్లను పెంచినట్లు తెలిపారు. వాటికి అభివృద్ధి నిధులను కూడా అధికంగా ఇచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ -సికింద్రాబాద్ అనేది తెలంగాణ ప్రజల గొప్ప అస్తిత్వం చిహ్నాలు.. కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న తుగ్లకు నిర్ణయం వలన సికింద్రాబాద్‌కి చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయేటట్లు ఉన్నదని అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రజలంతా సంఘటితమై.. మా పార్టీని ఆహ్వానించారని, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం తమ పార్టీకి చెందిన వారని అన్నారు. సికింద్రాబాద్‌లో పుట్టిన బిడ్డలుగా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్నారు.. అధికారం ఇచ్చింది పట్టణాల అస్తిత్వాలను ప్రజల అస్తిత్వాలను గుర్తు లేకుండా చేరపడం కోసం కాదని కేటీఆర్ అన్నారు. ఈరోజు శాంతి ర్యాలీ పేరుతో సికింద్రాబాద్ ప్రజలు ప్రజాప్రతినిధులు ఒక కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టారు.. ప్రజల కోరిక మేరకు ప్రజాప్రతినిధులతెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్దామని సిద్ధంగా ఉన్నాం.. నిన్న రాత్రి వరకు అనుమతి ఉందని చెప్పి ఇప్పుడు అనుమతి లేదని చెప్పి వేలాదిమంది కార్పొరేటర్లను, మాజీ కార్పొరేటర్లను, పార్టీ సీనియర్ నాయకులను, సాధారణ ప్రజలను ఎక్కికక్కడ అరెస్టు చేశారు.. ఇంత అరాచకంగా, అక్రమంగా పనిచేస్తున్న ప్రభుత్వం అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి అని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్, కాలె యాదయ్య, కెపి వివేకానంద, ఎమ్మెల్సీలు దేశపతి, వాణి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
సికింద్రాబాద్‌కు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌కు మద్దతుగా ’సికింద్రాబాద్ బచావో’ పేరుతో ర్యాలీ నిర్వహించేందుకు బీపిలుపునిచ్చింది. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ వద్ద బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోగా ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ సీపీ హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలు ఆలోచించాలని, సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





