– అందరి ఆమోదంతోనే ముందుకు సాగుతాం
– మంత్రి తుమ్మల వెల్లడి
ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: కులగణన ఆధారంగా బీసీల రిజర్వేషన్ల కోసం శాసనసభలో అన్ని పార్టీల ఆమోదం తీసుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు ద్వారా న్యాయం కోసం ముందుకెళ్లామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. సత్తుపల్లిలో చేపట్టిన బీసీ బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా రాజ్యాంగబద్ధంగా అందరికీ సమన్యాయం జరిగి, రాజ్యాధికారం కల్పించాలనేదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్దేశమని పేర్కొన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని మంత్రి తుమ్మల గుర్తు చేశారు.అందరికీ విద్యా, ఉద్యోగం కల్పించాలనే గొప్ప సామాజిక విప్లవం కోసం రాహుల్ గాంధీ మేనిఫెస్టో రూపొందించారని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. కొద్ది తేడాతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేక పోయిందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకామరమే.. బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగబద్ధంగా ఉన్న అధికారాలతోనే చట్టం చేశామని పేర్కొన్నారు. చట్టబద్ధత ఇవ్వాల్సిన గవర్నర్లు, రాష్ట్రపతి పట్టించుకోవడం లేదని తుమ్మల ఆరోపించారు. న్యాయబద్ధంగా చట్టసభల్లో అమలు చేసిన కూడా సాంకేతిక కారణాలతో బీసీ రిజర్వేషన్ల అమలుకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. గుజరాత్ రాష్ట్రంలో చట్ట సవరణ ద్వారానే ప్రధానమంత్రి మోదీ బీసీగా కన్వర్ట్ అయ్యారని మంత్రి తుమ్మల తెలిపారు. నరేంద్ర మోదీ కులం బీసీ కాకపోయినా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆయన సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చిందని పేర్కొన్నారు. బీసీగా ప్రధానమంత్రి స్థానం దక్కించుకున్న మోదీ, తెలంగాణలో బీసీలకు న్యాయం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





