ఆచార్య గారి ఇంగ్లీష్ అనువాదాలు

  1. జనధర్మో విజయతే 

మన రాజ్యాంగం, మన సామ్రాజ్యం, మన ప్రజారాజ్యం మాటలు బాగానే ఉన్నాయి. కాని స్వాతంత్ర్యం అంటే ఏమిటి? అని ప్ర్రశ్న వేసి తన తొలి పత్రిక లో జనధర్మ అయ్యగారు అని అందరూ పిలుచుకునే యం యస్ ఆచార్య ఎంత గొప్పగా ఇచ్చిన జవాబులు చదవండి. 

స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛావిహారం కాదు.

స్వాతంత్ర్యం అంటే స్వాప్నిక స్వారాజ్య సదృశ పరోక్షానుభూతి కాదు. 

స్వాతంత్ర్యం అనేది ‘ఫినిక్స్’ కాదు.

స్వాతంత్ర్యం ‘దామస్ మూర్’, ‘అటోపియనిజమ్’ కాదు.

స్వాతంత్ర్యం ప్రత్యాక్షానుభూతి!

స్వాతంత్ర్యం సుశిక్షిత స్వేచ్ఛ!!

స్వత్వాల్తోపాటు స్వధర్మాల పరిపూర్ణజ్ఞానం స్వాతంత్ర్యం!!!

ఆచార్య గారు ఇంగ్లీషు నవలలు చదివేవారు. ఏ జి గార్డినన్ రచయిత వారికి అభిమాని. ఆ పుస్తకంలో చెప్పిన అంశాలు ప్రస్తావిస్తూ మీకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిచే స్వాతంత్ర్యం లేదని వివరిస్తారు. ఆ ఇంగ్లీషు పేరగ్రాఫ్ ను ఆచార్య అనువదించారు. ఏ జి గార్డినన్ చెప్పినట్టు రోడ్డుండా వెళ్లే స్వాతంత్ర్యం నీకుంది. అయితే రోడ్డు ఒక ప్రక్కనుండ మరో ప్రక్కకు గంతులు వేస్తూ నడిచావా రోడ్డున వెళ్లే ఇతరులకు నువ్వొ అవరోధంగా పరిణమించినా పరిణమించవచ్చు. లేక స్వాతంత్ర్యాన్ని నీలాగే అపార్థం చేసుకున్న మరో వ్యక్తి ఎవరైనా నిన్ను ఢీకొంటూ నీమీన్నుంచే తన కార్ ను తీసుకొళ్లొచ్చు! అందుకని నీ మేలుకోసమైతేనేం, ఇతరులకు నువ్వు కష్టకారణం కాకుండడానికై  తేనేం రోడ్డుకు ఈ ప్రక్కన నడవడం వాంఛనీయం. ‘ఇలా రోడ్డు మొత్తాన్నాక్రమించుకుని నడొవొద్దు… ఆ ప్రక్కనుంచి వెళ్లు’అని చెప్పడానికి లేదా కనిపెట్టుతూ వుండడానికి అడుగడుగునా రక్షక భటులు వుండనవసరం లేదు.

‘నేనిలా గంతులు వేస్తూ నడిస్తే నావరకు నాకు ప్రమాదకరమై, ఇతరులకూ బాధకరమూనూ, అందుకని వో ప్రక్కన నడపడం మంచిది. సరిగదా, తెలియక, లేదా తుంటరితనంగా వేరొకరెవరేనా ఇలా నడుస్తోంటే వారిచడం నా ధర్మం… నా విధి, నా బాధ్యత!’’ అనే జ్ఞానం కలిగిన్నాడే నిజంగా నీకు స్వాతంత్ర్యం వచ్చినట్టు! నువ్వు స్వయంగా రొడ్డుమీద గంతులు వేస్తూ నీలాగే గంతులు వేస్తూ నడిచే మరోణ్ణి అలా నడవగూడదని వారిస్తే ‘ మరి నీకీ నియమం వర్తించదా’ అనేస్తాడు. అందుకని ముందు నీ స్వధర్మాన్ని..నీ బాధ్యతని…నీ విధిని…నీవు చక్కగా వర్వర్తించితేనేగాని నీ దారికి…నీలా స్వాతంత్ర్యం వున్న లక్షలాదిజనం దారికి ..ఆటంకం కలిగించే వాణ్ణి వారించే స్వత్వం.. హక్కు..నీకు చెందుతుందన్నమాట.

ఈ ట్రాఫిక్ నియమం విషయమైన ప్రస్తావన ఉదాహరణకు పేర్కోబడింది మాత్రమే. నిజానికి ఎలాంటి ప్రోద్బల, ప్రోత్సాహాలూ లేకుండా స్వచ్ఛంగంగా స్వధర్మాల్ని నిర్వర్తిస్తూ, నిర్భయంగా, స్వత్వాల్ని ఆశిస్తూ ప్రతీ విషయంలోనూ ‘మనకెందుకొచ్చిన గొడవ’ అనే ఉపేక్షాభావాన్ని విడనాడి సోదర నాగరికుడు మొందలు మనం ఎన్నుకునే ప్రతినిధులు వరకు ప్రతివాడూ తన విద్యుక్త ధర్మాల్ని చక్కగా నిర్వర్తించేట్టు హక్కుల్ని సరిగా పొందేట్టు నిరంతరం జాగరూకత కలిగిఉండడమనేది అలవర్చుకోవాలి.  ఛివరకు ఆచార్య జనదర్మ మనదర్మ అంటూ ఈ విధంగా ముగించారు. ‘అనవరత జాగరం స్వాతంత్ర్య స్థితికి ఆధారభూతం’ అని మరువరాదు. ఈ అనవతర జాగరమే జనదర్మ..మనధర్మ! మన స్వాతంత్ర్యానికి పెట్టని కోట!!

మాడభూషి అనంతశయనం అయ్యంగార్ పరిచయం

జనధర్మను అభినందించిన మాడభూషి అనంతశయనం అయ్యంగారు స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, రెండో లోక్‌సభ స్పీకర్. 1891, ఫిబ్రవరి 4 తేదీన చిత్తూరు జిల్లా, తిరుచానూరులో వెంకట వరదాచారి దంపతులకు జన్మించారు. స్వస్థలం తిరుపతి. ముందు గణిత ఉపాధ్యాయుడు.పచ్చయప్ప కళాశాల నుండి 1913 మద్రాసు లా కాలేజీ చదివారు. తరువాత న్యాయవాది 1915 -1950 దాకా ప్రాక్టీస్ చేసారు. స్వాతంత్ర్య సమరంలో (వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా) పాల్గొని రెండు సార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాడు.

1934లో మొదటిసారిగా కేంద్ర శాసనసభలో సభ్యుడు. స్వాతంత్ర్యం తరువాత తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండు సార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.  1948లో మొదటి లోక్‌సభలో డిప్యూటీ స్పీకరుగా తరువాత 1956లో స్పీకర్.  1962లో బీహార్ గవర్నరుగా నియమితులై 1967 వరకు ఆ పదవిలో ఉన్నాడు. కేంద్రీయ సంస్కృత విద్యాపీఠానికి అధ్యక్షులుగా 1966లో ఎన్నుకోబడి చివరిదాకా ఆ పదవి నిర్వహించాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఇతడు 1978 మార్చి 19న తిరుపతిలో పరమపదించాడు. ఇతని జ్ఞాపకార్ధం 2007 సంవత్సరంలో కంచు విగ్రహాన్ని తిరుపతి పట్టణంలో నెలకొల్పారు. ఇతని కుమార్తె పద్మా సేథ్ ఢిల్లీ బాలభవన్ అధ్యక్షురాలిగా, మహిళా కమిషన్ సభ్యురాలిగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా, యునిసెఫ్ సలహాదారుగా పనిచేసింది. కేంద్ర సమాచార కమిషన్ గా ఆర్టీఐ పుస్తకం ఆవిష్కరణలో స్వయంగా కలిసి పరిచయం చేసారు. వారితో స్నేహం సంపాదించుకున్నాను. ఎం పీ జైరమేశ్ గారి కుమారుడు నల్సార్ లో లా విద్యార్థి, నేను ప్రొఫెసర్ గా ఉన్నపుడు పరిచయం చేయగానే మాడభూషి గురించి ఒక సంఘటన చెప్పారు. పండిత్ జవాహర్లాల్ నెహ్రూ లోకసభలో మాడభూషి గారిపై  ‘మీరు అనంతశయనంగా ఉండాలి. కాని అనంతప్రసంగంతో ఉండకూడదుఅని వ్యంగ్య బాణం విసిరారట.

మాడభూషి శ్రీధర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *