- సవరణ జీ.ఓ.నెంబర్ 103 జారీ
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి26: ప్రభుత్వం జారీచేసిన అక్రిడిటేషన్ల జీ.ఓ.పై జర్నలిస్టుల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో ప్రభుత్వం దిద్దుబాటుకు పూనుకుంది. డెస్క్ జర్నలిస్టులకు సైతం అక్రిడిటేషన్ కార్డులే జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ జీ.ఓ. నెంబర్ 103 పై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం హర్షం వ్యక్తం చేసింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ మాట్లాడుతూ గతంలో తీసుకువచ్చిన 252 జీ.ఓ.పై టీయూడబ్ల్యూజే చేసిన పోరాట ఫలితంగా జర్నలిస్టు సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసిందన్నారు. సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవరణ జీ.ఓ. తేవడం, అందులో ప్రధానంగా అందరి జర్నలిస్టుల మాదిరిగానే డెస్క్ జర్నలిస్ట్ సైతం అక్రిడిటేషన్ కార్డులే జారీచేస్తామని చేస్తున్నారని స్పష్టం చేయడం ముదావహం అన్నారు. మండల స్థాయిలో లక్షన్నరకు పైగా జనాభా ఉన్నచోట అదనపు కార్డులు ఇస్తామని పేర్కొనడంతోపాటు కల్చరల్, స్పోర్ట్స్ సినిమా జర్నలిస్టులకు సైతం ప్రత్యేకంగా కార్డులు జారీ చేస్తానని ప్రకటించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జీవో మారడం టీయూడబ్ల్యూజే సాధించిన విజయమని పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో వచ్చిన 239 జీ.ఓ. ప్రకారం వచ్చినన్ని అక్రిడేషన్ కార్డులు ఈ సవరణ జీ.ఓ. అనంతరం కూడా ఆ స్థాయిలో రావడంలేదని విషయం తేటతెల్లమైందన్నారు.
————————————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.