అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు

హైదరాబాద్, ఫిబ్రవరి 18 : రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ జిఓఎంఎస్ నెం.252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఫ్రీ ల్యాన్సర్, వెటరన్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమాచార శాఖ ప్రత్యేక వెబ్‌సైట్ ను రూపొందించామన్నారు. ipr.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 9వ తేదీ నుండి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నామన్నారు. అక్రిడిటేషన్ దరఖాస్తు, జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దరఖాస్తు చేసుకునే సమయంలో ఏదైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే సమాచార శాఖ మీడియా రిలేషన్ విభాగంలో 9154170881కు కార్యాలయం పనివేళల్లో (ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల)లో సంప్రదించవచ్చునని ఆమె తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *