– ఆ మేరకు బ్యాంక్‌తో అనుసంధానించండి
– అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర,జనవరి 12: వాహనాలకు చలానాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు కీలక సూచనలు చేశారు. అవి ఎంతోకాలం పెండింగ్‌లో లేకుండా వెంటనే వారి ఖాతాల నుంచి కట్ అయ్యేలా చూడాలన్నారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్ సేప్టీ ప్రచార కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. వాహనం పై చలాన్ పడిన వెంటనే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యేలా చూడాలన్నారు. యజమాని వాహనాన్ని రిజిస్టేష్రన్ చేయించడానికి వచ్చినప్పుడే బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకోండి. ఆ వివరాలు సింక్ చేయండి. చలాన్ పడిన వెంటనే ఆటోమేటిక్‌గా డబ్బులు ఖాతా నుంచి కట్ కావాలని రేవంత్ అన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశ జీడీపీలో 3 శాతం మేర నష్టం జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి నిమిషానికో రోడ్డు ప్రమాదం జరుగుతోందని, 3 నిమిషాలకో ప్రాణం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాద నివారణకు పోలీసుశాఖ ప్రణాళిక చేపట్టిందన్నారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. సమాజంలో కొందరి నిర్లక్ష్యం మరొకరికి ప్రాణాపాయంగా మారుతోంది. రోడ్డు ప్రమాదాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలి. ఫిజికల్ క్రైమ్‌తో పాటు సైబర్ నేరాలు భారీగా పెరిగిపోయాయి. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. వీటి నియంత్రణలో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రమాదాల నివారణ కోసం అరైవ్ అలైవ్ అనే ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇందులో పోలీసులు, రవాణా శాఖ పని మాత్రమే కాదు.. ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. గతేడాది రోడ్డు ప్రమాదాలు పెరిగినా.. విస్తృత అవగాహనతో మరణాల సంఖ్య తగ్గిందని చెప్పారు. అందరూ కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. జనవరి 13 నుంచి 24 వరకు పది రోజుల పాటు అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొన్న ప్రభాకర్, డిజిపి శివధర్ రెడ్డి, సివి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





