విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం

– ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న లారీ
– ఇద్దరు బస్సు డ్రైవ‌ర్ల దుర్మరణం, క్లీనర్‌కు గాయాలు

నల్గొండ, ప్రజాతంత్ర, మార్చి 10: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు బ‌స్సు డ్రైవ‌ర్లు దుర్మ‌ర‌ణం చెందారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో కాకినాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాజమండ్రి వైపు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఒకదానికొకటి స్వల్పంగా తగిలాయి. దీంతో రెండు వాహనాలను పక్కకు ఆపి డ్రైవ‌ర్లు మాట్లాడుకుంటున్నారు. అది గమనించిన మరో ట్రావెల్ బస్సును కూడా అక్కడ ఆపారు. రెండో బస్సు డ్రైవ‌ర్లు శ్రీనివాస్, బంగారయ్య వచ్చి గొడవ గురించి చర్చించారు. ఇంతలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న లారీ అతివేగంతో దూసుకొచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో నలుగురు వ్యక్తులు రెండు లారీల మధ్య నలిగిపోయారు. ఈ ఘటనలో రెండో బస్సు డ్రైవ‌ర్లు శ్రీనివాస్, బంగారయ్య దుర్మరణం చెందారు. మొదటి బస్సు క్లీనర్ సురేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవ‌ర్ల మృతదేహాలను నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం తరలించారు. మూడు వాహనాలను పోలీసులు స్టేషన్‌కు తరలించి రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *