ఔటర్‌పై వాహనం ఢీకొని ముగ్గరు కార్మికుల మృతి

దరాబాద్‌,ఆగస్ట్‌11(ఆర్‌ఎన్‌ఎ): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్‌పై పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులు ఒడిశాకు చెందిన నారాయ(28), చెక్‌మోహన్‌(24), జైరామ్‌(32)గా గుర్తించారు. గాజువాక నుంచి సెల్‌ఫోన్‌ టవర్‌ సామగ్రితో వాహనం షావిూర్‌పేట్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు- తెలుస్తోంది. వాహనం డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు- గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *