ఓఆర్ఆర్ పై ఘోర‌ ప్రమాదం

– ఆగిన కారుపైకి దూసుకెళ్లిన కంటెయినర్
– ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం

మేడ్చల్, ప్రజాతంత్ర, మార్చి 16: భోజనం కోసం రోడ్డు పక్కన కారు ఆపడమే వారి పాలిట శాపమైంది. కంటైనర్ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఓఆర్ఆర్ పక్కన కారు నిలిపి భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ పై చోటుచేసుకుంది. మృతులను మౌలాలికి చెందిన మహ్మద్ యూసుఫ్ ఖాన్ (51), కాప్రా సాకేత్ కు చెందిన హుస్సేన్ (53)గా గుర్తించారు. మద్యం మత్తులో కంటైనర్ నడిపిన డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  స్థానికుల సమాచారం ప్రకారం నగరంలోని మౌలాలి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆడి కారులో ప్రయాణిస్తున్నారు. శామీర్‌పేట సమీపంలో  వారు ఓఆర్ఆర్ పై కారును ఆపి పక్కనే నిలబడి భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన కంటైనర్ వారిపై దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరూ తీవ్ర గాయాల‌తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థ లానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప హాస్పిట‌ల్‌కు తరలించారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి అతి వేగమే కార ణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *