– రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొని ఆరుగురు దుర్మరణం
చెన్నై,నవంబర్24: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెంకాశీ-మదురై రోడ్డులో ఎదురెదురుగా వొస్తున్న రెండు ప్రైవేటు బస్సులు ఒకదాన్నొకటి ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో 28 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మదురై నుంచి సెన్‌కొట్టాయ్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు తెన్‌కాశీ నుంచి వొస్తోన్న మరో బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి రెండు బస్సులూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, సీసీ టీవీ ఫుటేజ్‌లను సేకరిస్తున్నామని తెలిపారు. ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





