– తాగి ట్రక్ నడిపిన డ్రైవర్
- ప్రమాదంలో 10మంది పైగా దుర్మరణం
జయపుర, నవంబర్ 3: వరుస రోడ్డు ప్రమాదాలతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాజస్థాన్‌లోని ఫలోడి జిల్లాలో ఓ టెంపో కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో 18 మంది చనిపోయారు. సోమవారం తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో 20మంది మృతిచెందగా.. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు సంఘటనల నుంచి తేరుకోక ముందే మరో ప్రమాదం సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ ట్రక్ డ్రైవర్ తాగిన మత్తులో బీభత్సం సృష్టించాడు. ట్రక్కుతో ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 10 మంది పైగా ప్రాణాలు కోల్పోగా మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రమాదం జరిగిన లోహమండి రోడ్‌లోని ఓ షాపులో రికార్డు అయ్యాయి. ఆ సీసీటీవీ ఫుటేజీలో భీకర దృశ్యాలు ఉన్నాయి. ఆ ట్రక్ అడ్డం వచ్చిన వాహనాన్ని వాయు వేగంతో ఢీకొట్టుకుంటూ వెళ్లి పలువురి ప్రాణాలు తీసింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఓ దారుణమైన విషయం బయటపడింది. ట్రక్ అదుపు తప్పిన తర్వాత ఆ డ్రైవర్ అర కిలోటర్ వరకు బ్రేకులు వెయ్యలేదు. అడ్డం వచ్చిన వాహనాలను ఢీకొట్టుకుంటూనే వెళ్లిపోయాడు. పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అతడ్ని విచారిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





