మిర్యాలగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

– డీసీఎం, సిమెంట్‌ ట్యాంకర్‌ ఢీ: ముగ్గురి దుర్మ‌ర‌ణం

నల్లగొండ, ప్రజాతంత్ర, జనవరి 9: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఈదులగూడ చౌరస్తా వద్ద శుక్ర‌వారం ఉద‌యం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు టైల్స్‌ తరలిస్తున్న డీసీఎం సిమెంట్‌ ట్యాంకర్‌ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు దుర్మ‌ర‌ణం చెంద‌గా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా బీహార్‌ వాసులుగా గుర్తించారు. వీరిలో బీరు బాయ్‌ (30), సంతోష్‌ (30), సూరజ్‌ (18) ఉన్నారు. డీసీఎంలో ఉన్న టైల్స్‌ కూలీలపై పడటంతో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనతో ట్రాఫిక్‌ స్తంభించిపోగా క్రేన్‌ సహాయంతో రహదారిపై నుంచి లారీని, డీసీఎంను తొలగించి పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిర్యాలగూడలోని ఈ రహదారిపై అత్యంత జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచించారు. పరిమితికి మించి లోడ్‌తో వెళ్లే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *