గణేశ్‌ నిమజ్జనంలో అపశృతి

– ట్రాక్టర్‌ను ఢీకొన్న డిసిఎం.. ఇద్ద‌రి దుర్మ‌ర‌ణం

మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను డీసీఎం బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా నాచపల్లి గ్రామానికి చెందిన 11 మంది గురువారం అర్ధరాత్రి దాటాక జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద ఉన్న కృష్ణా నదిలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్‌పై గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ శివారులో డీసీఎం వాహనం వెనక వైపు నుంచి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ట్రాక్టర్‌ ఇంజిన్‌పై డ్రైవర్‌ పక్కన కూర్చున్న మండ్ల శంకర్‌ (21), గుప్తా సాయి తేజ (23) అక్కడికక్కడే మృతిచెందారు. విష్ణు, అబ్దుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వనపర్తి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. డీసీఎం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందినదిగా గుర్తించారు. వాహన డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *