లారీని ఢీకొన్న కారు.. నలుగురు దుర్మరణం
ఆదిభట్ల, ప్రజాతంత్ర, జులై 18: రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం బొంగులూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు హాస్పిటల్‌కు తీసుకెళ్లాక తిచెందాడు. తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద అంబర్‌పేట్ నుంచి బొంగులూర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను మొయినబాద్ గ్రీన్‌వాలీ రిసార్ట్‌లో పనిచేసే వారుగా గుర్తించారు. మలోత్ చందు లాల్(29), గగులోత్ జనార్దన్ (50), కావలి బాలరాజు (40), మరొకరు మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు





