డీటీసీ కిషన్ నాయక్ ఇంట్లో భారీగా ఆస్తులు

– అరెస్ట్ చేసిన ఏసీబీ

మహబూబ్ న‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 23 :ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో రవాణాశాఖ మహబూబ్ న‌గ‌ర్‌ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ బోయిన్ పల్లిలోని ఆర్ఆర్ న‌గ‌ర్‌లో గల ఆయన నివాసంతోపాటు దాదాపు 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు భారీగా ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్లో ఆ ఆస్తుల విలువ రూ.36 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్ల్సులు హోటళ్లు, స్థిర, చరాస్తులతో పాటు, బ్యాంకు లాకర్లలో కిలోన్నర బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. కిషన్ నాయక్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *