విద్యుత్‌ ఏడీఈ అంబేద్కర్‌ ఇం‌ట్లో ఏసీబీ సోదాలు

– భారీగా ఆస్తులను గుర్తించిన అధికారులు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌16:‌విద్యుత్‌ ‌శాఖ ఏడీఈ అంబేద్కర్‌ ఇం‌ట్లో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు.మణికొండలోని నివాసంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధుల ఇండ్లలోనూ సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో విద్యుత్‌ ‌శాఖ ఏడీఈ అంబేద్కర్‌ ఇం‌ట్లో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు కొనసాగాయి. ఏడీఈ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి గచ్చిబౌలి, మాదాపూర్‌, ‌హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మెదక్‌, ‌నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో తనిఖీల్లో భాగంగా భారీ ఆస్తులు బయటపడుతున్నాయి. గచ్చిబౌలిలో ఖరీదైన భవనం గుర్తించినట్లుగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ ‌వెల్లడించారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 10 ఎకరాల వ్యవసాయ భూమిని అంబేద్కర్‌ ‌కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అక్కడే మరో వెయ్యి గజాల్లో వ్యవసాయ క్షేత్రం కూడా ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. విద్యుత్‌ ‌శాఖ ఏడీఈ అంబేడ్కర్‌ ఆస్తులపై సోదాలు ముగిశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తాం ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ ‌తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *