వరంగల్‌ ‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయంపై ఏసీబీ దాడి

– ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్ల అక్రమాలపై ఆరా
– తనిఖీల్లో అక్రమ లావాదేవీలు, లంచాలు గుర్తింపు
– భారీగా నగదు, నగలు, డాక్యుమెంట్లు స్వాధీనం

వరంగల్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌వరంగల్‌ ‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, డాక్యుమెంట్లు ఇద్దరు సబ్‌ ‌రిజిస్ట్రార్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. సబ్‌ ‌రిజిస్ట్రార్‌-1 ‌జమాలపురం రామనరసింహరావు, రిజిస్ట్రార్‌-2 ‌దేవులూరి ఆనంద్‌ ‌ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఇద్దరు అధికారులు డాక్యుమెంట్‌ ‌రైటర్లతో జరిపిన ఫోన్‌ ‌పే పరిశీలించగా సుమారు రూ.42 లక్షలు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. వీరి వ‌ద్ద‌ 70 రిజిస్ట్రేషన్‌ ‌కాని డాక్యుమెంట్లను పరిశీలించారు. అదేవిధంగా ఇద్దరు ఇళ్ల నుంచి రూ.24.61 లక్షల నగదును, 819.500 గ్రాముల బంగారు ఆభరణాలను, 2.600 కిలో గ్రాముల వెండి ఆభరణాలను, రూ.30 లక్షల ఫిక్స్‌డ్‌ ‌డిపాజిట్లను గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించి ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు. వరంగల్‌ ‌సబ్‌ ‌రిజిస్టేష్రన్‌ ‌కార్యాలయంలో అవినీతి అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదులు అందడంతో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సబ్‌ ‌రిజిస్టార్ల ్రఅక్రమ లావాదేవీలు, అనధికారిక వ్యక్తులతో వారు సాగిస్తున్న చీకటి ఒప్పందాలు వెలుగులోకి వచ్చాయి. సబ్‌ ‌రిజిస్టార్లయ్రిన జమాల్పూర్‌ ‌రామ్‌ ‌నర్సింహారావు, దేవులూరి ఆనంద్‌ ‌తమ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తులను అనధికారికంగా డాక్యుమెంట్‌ ‌రైటర్లుగా నియమించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. వీరిద్దరూ డాక్యుమెంట్‌ ‌రైటర్లతో కలిసి రిజిస్టేష్రన్ల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కేవలం ఈ అనధికారిక రైటర్లు పంపిన పత్రాలను మాత్రమే వీరిద్దరు ప్రాధాన్యత ఇచ్చి రిజిస్టేష్రన్‌ ‌చేస్తున్నట్లు తేలింది. కార్యాలయంలో  పూర్తి కాని సుమారు 70 డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్‌ ‌రిజిస్టార్ల్రు డాక్యుమెంట్‌ ‌రైటర్ల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు వాట్సాప్‌ ‌చాట్‌ ‌ద్వారా బట్టబయల య్యాయి. గత ఏడాది కాలంలోనే డాక్యుమెంట్‌ ‌రైటర్ల ద్వారా ఈ ఇద్దరు అధికారులు సుమారు రూ. 42 లక్షలను లంచంగా తీసుకున్నట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. కార్యాలయంలో సోదాల అనంతరం ఏసీబీ బృందాలు ఇద్దరి నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. వీరి ఇళ్లలో లక్షలాది రూపాయల నగదుతో పాటు భారీగా అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు కనుగొన్నారు. ఇక్కడ ఓ షాకింగ్‌ అం‌శం వెలుగులోకి వచ్చింది. ఓ అధికారి ఇంట్లో రిజిస్ట్రేషన్‌ ‌చేయని 254 ప్రభుత్వ పత్రాలు లభించడం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన పత్రాలు అధికారుల ఇళ్లలో ఎందుకు ఉన్నాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఈ ఇద్దరు అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న నగదు, డాక్యుమెంట్లు, డిజిటల్‌ ఆధారాలను పరిశీలిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *