ఇద్దరు అవినీతి ఉద్యోగుల పట్టివేత

– నిర్మల్‌, ‌ఖమ్మం జిల్లాల్లో

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: అవినీతికి పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. నిర్మల్‌, ‌ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్‌ ‌జిల్లా భైంసా మండలంలో తానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.భీమన్న గురువారం మధ్యాహ్నం బాధితుడి నుంచి రూ. 9వేలు ఫోన్‌ ‌పే చేయించుకున్నందుకు ఆధారాలతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భైంసా ఎన్‌బీ నగర్‌లో నివాసముండే ఒకరు మెడికల్‌ ‌రీయింబర్స్‌మెంట్‌ ‌బిల్లులు, సరెండర్‌ ‌లీవ్‌, ఎఫ్‌టీఏ బిల్లు కోసం సీనియర్‌ అసిసెంట్‌ను సంప్రదించగా లంచం డిమాండ్‌ ‌చేశారు. దీంతో బాధితుడు ఆదిలాబాద్‌ ‌రేంజ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వ్యూహం ప్రకారం దాడులు చేసి భీమనన్ను పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి తహసీల్దార్‌ ‌కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ‌గా పనిచేస్తున్న ఉషా శుభ కామేశ్వరి రూ.10 వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డారు. ల్యాండ్‌ ‌మ్యుటేషన్‌ ‌కోసం అవసరమైన ఫ్యామిలీ మెంబర్స్ ‌సర్టిఫికేట్‌కు ఆర్‌ఐను సంప్రదించారు. దీంతో లంచం డిమాండ్‌ ‌చేసిన ఆమెకు రూ.10 వేలు బాధితులు అందిస్తుండగా మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆర్‌ఐపై కేసు నమోదు చేసుకుని ఏసీబీ కేసులను విచారిస్తున్న వరంగల్‌ ‌జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *